Share News

లాభసాటి వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానం

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:55 AM

రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అల వరచుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సార్క్‌ దేశాల ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్‌ కింజాంగ్‌ అన్నారు.

లాభసాటి వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానం
కటికవానికుంటలో కంది, కొర్ర అంతర సాగు పంటలను పరిశీలిస్తున్న డాక్టర్‌ కింజాంగ్‌

సార్క్‌ దేశాల ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్‌ కింజాంగ్‌

బనగానపల్లె, ఆగస్టు 20: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అల వరచుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సార్క్‌ దేశాల ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్‌ కింజాంగ్‌ అన్నారు. మంగళవారం బనగా నపల్లె పట్టణ శివారులోని యాగంటిపల్లె కృషి విజ్ఞానకేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలకు కెవికె తరపున పెరటికోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కింజాంగ్‌ వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలు అవలంభిస్తున్న రైతుల అనుభవాలను నేరుగా పంట పొలాలను సందర్శించి తెలుసుకున్నారు. కొర్ర, కంది పంటల అంతర సాగును, వాటి వల్ల ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు కటికవాని కుంట, చెర్లోకొత్తూరు గ్రామాల్లో చేపట్టిన నీటి కుంటలను ఆయన సందర్శిం చారు. నీటికుంటల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. పెరటికోళ్ల పెంపకంపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మహిళకు పెరటి కోళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాతీయ మెట్ట పరిశోధన కోఆర్డినే టర్‌ డాక్టర్‌ జెవిఎస్‌ఎస్‌ ప్రసాద్‌, కేవీకే కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఽధనలక్ష్మి, సొసైటీ అడ్మినిసే్ట్రటివ్‌ అధికారి సురేశ, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:56 AM