Share News

టీడీపీదే విజయం: బీసీ

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:29 AM

రాష్ట్రంలో తెలుగుదేశం టీడీపీ కూటమితే విజయమని బనగానపల్లె నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీదే విజయం: బీసీ

బనగానపల్లె, జూన్‌ 3: రాష్ట్రంలో తెలుగుదేశం టీడీపీ కూటమితే విజయమని బనగానపల్లె నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయ న బనగా నపల్లె టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, చంద్రబా బునాయుడు ముఖ్య మంత్రి కావడం ఖాయమన్నారు. టీడీపీ నాయ కులు, కార్యకర్తల కృషితో పాటు యువకులు, ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు, మహిళలు, వైసీపీ వర్గీయులచే అణచివేయబడ్డ వర్గీయుల ఆశీస్సులతో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయ కులు తన గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని, వారికి రుణపడి ఉం టానని ఎమ్మెల్యే బీసీ పేర్కొన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని రాష్ట్రంలో కూటమే అధికా రంలోకి వస్తుందని సర్వేలో తేల్చారన్నారు. వైసీపీ అవినీతి పాలనకు వ్యతి రేకంగా ప్రజలు ఉవ్వెత్తున ఎగసి కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశా రన్నారు. చంద్ర బాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలు తమ విజ యంలో ప్రధాన భూమిక పోషించనున్నట్లు బీసీ తెలిపారు.

కౌంటింగ్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: కౌంటింగ్‌ సమ యంలో ఏజెంట్లలంతా అప్రమత్తంగా ఉండాలని బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం బనగానపల్లె టీడీపీ పార్టీ కార్యాల యంలో టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా బీసీ మాట్లాడుతూ నంద్యాల శాంతిరాం ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న కౌంటింగ్‌ మంగళవారం హాజరవుతున్న ఏజెంట్లకు ఆయన పలు సూచ నలు, సలహాలు అందించారు. ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్‌ వద్ద ఉండి ప్రతి విషయాన్ని గమనిం చాలన్నారు. ముఖ్యంగా కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై ఏదైనా అనుమానాలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికా రులతోపాటు ఆర్‌వోకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:29 AM