‘బీసీల నడ్డి విరుస్తున్న వైసీపీ’
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:17 AM
వైసీపీ ప్రభుత్వం బీసీల నడ్డి విరుస్తోందని టీడీపీ బీసీ రాష్ట్ర సాధికార సమితి కన్వీనర్ వై.నాగేశ్వరరావుయాదవ్ విమర్శించారు.

డోన్, జనవరి 11: వైసీపీ ప్రభుత్వం బీసీల నడ్డి విరుస్తోందని టీడీపీ బీసీ రాష్ట్ర సాధికార సమితి కన్వీనర్ వై.నాగేశ్వరరావుయాదవ్ విమర్శించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా అనగదొక్కుతోందని ఆరోపించారు. అలాగే బీసీల సంక్షేమం కోసం చంద్రబాబు అమలు పరిచిన అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేయడం బాధాకరమన్నారు. బీసీల ద్రోహిగా మారిన సీఎం జగన్‌కు గుణపాఠం చెప్పాలని నాగేశ్వరరావు యాదవ్ పిలుపునిచ్చారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని పురష్కరించుకొని నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, నాయకుటు ప్రజావైద్యశాల మల్లికార్జున, శ్రీనివాసులు యాదవ్, అబ్బిరెడ్డిపల్లి గోవిందు, ఎర్రమల నాయుడు తదితరులు పాల్గొన్నారు.