Share News

జీజీహెచ్‌లో టీబీ ముక్త్‌ భారత్‌ బృందం పర్యటన

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:19 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో టీబీ ముక్త్‌ భారత్‌ బృందం గురు వారం ఉదయం పర్యటించింది.

జీజీహెచ్‌లో టీబీ ముక్త్‌ భారత్‌ బృందం పర్యటన
సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్న డాక్టర్‌ నీరద

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో టీబీ ముక్త్‌ భారత్‌ బృందం గురు వారం ఉదయం పర్యటించింది. ఆసుపత్రిలోని న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌తోపాటు ఊపిరితిత్తుల వార్డు ఇతర విభాగాలను టీబీ ముక్త్‌భారత్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నీరద పరిశీలించారు. ఆసుప త్రిలో వైద్యసిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్రిమిసంహాయక, స్టెరిలైజేషన్‌ పర్యావరణ సంక్రమణ నియంత్రణ, చేతి పరిశుభ్రమైన ఐజే లోషన్‌ జాగ్రత్తలను వివరించారు. అంటు వ్యాధుల నివారణలో వైద్య సిబ్బంది పాత్ర కీలకమైనదని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సి.ప్రభాకర్‌ రెడ్డికి వివరించారు. డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ వెంకటరమణ, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్లు శివబాల, కిరణ్‌ కుమార్‌, న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌ ఇన్‌చార్జి సునీల్‌ ప్రశాంత్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సావిత్రీబాయి, ఐసీఎన్‌లు సంపత్‌, హర్షద్‌ పాల్గొన్నారు.

రూపురేఖలు మారనున్న ఫార్మసీ విభాగం:

ఫార్మసీ విభాగానికి త్వరలో రూపురేఖలు మార్చనున్నట్లు సూపరింటెండెంట్‌ సి.ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆసుప త్రిలో ఉదయం రౌండ్స్‌ నిర్వహించారు. న్యూరో సర్జరీలో టైల్స్‌ మరమ్మతులు చేయాలన్నారు. మార్చురి వద్ద డ్రైనేజీ పనులను పరిశీ లించారు. క్యాన్సర్‌ హాస్పిటల్‌ రోడ్డు సమీ పంలో ఉన్న డంప్‌యాడ్‌ దగ్గర ఉన్న వెస్టే జ్‌ను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - Oct 25 , 2024 | 12:19 AM