‘తర్తూరు జాతరను విజయవంతం చేయాలి’
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:40 PM
తర్తూరు లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్స వాలను విజయవంతం చేయాలని రూరల్ సీఐ విజయభాస్కర్ పిలుపు నిచ్చారు.

జూపాడుబంగ్లా, ఏప్రిల్ 3: తర్తూరు లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్స వాలను విజయవంతం చేయాలని రూరల్ సీఐ విజయభాస్కర్ పిలుపు నిచ్చారు. బుధవారం తర్తూరు దేవాలయంలో అధికారులతో జాతర ఏర్పా ట్లపై సమీక్షా సమావేశం సర్పంచ్ నాగిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసుశాఖ తరపున చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్‌శాఖ ఏఈ రామాచారి మాట్లాడుతూ ఉన్నాతాధికారులతో మాట్లాడి విద్యుత్తు సరఫరా ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తామని చెప్పారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాగేంద్ర మాట్లాడుతూ 2 నుంచి 3లక్షల వరకు జాతరకు వస్తారనే అంచనాతో అందుకు సంబంధించి తాగునీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దాతలు కూడా స్పందించి ట్యాంకర్ల ద్వారా, చలివేంద్రాల ద్వారా తాగునీటిని అందించాలని కోరారు. పీఆర్ ఏఈ బషీర్, జూపాడుబంగ్లా ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, ఆర్టీసీ అధికారులు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.