Share News

వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:50 AM

చాగలమర్రి మండలం ముత్యాలపాడు బస్టాం డు సమీపంలో ఆంజనేయులు (41) అనే వ్యక్తి సోమవారం అనుమా నాస్పద స్థితిలో మృతి చెందారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి

చాగలమర్రి, ఫిబ్రవరి 12: చాగలమర్రి మండలం ముత్యాలపాడు బస్టాం డు సమీపంలో ఆంజనేయులు (41) అనే వ్యక్తి సోమవారం అనుమా నాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఆంజనేయులు కు, చాగలమర్రికి చెందిన ఆదిలక్ష్మికి 2007 సంవత్సరంలో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వివాహం అనంతరం చాగలమర్రిలోనే నివాసం ఉంటూ ఆంజనేయులు హమాలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆంజనేయులుకు మద్యం తాగే అలవాటు ఉంది. గత రాత్రి ఇంటికి రాలేదు. ఉదయం ఇంటికి సమీపంలోని మిల్లులో చనిపోయి ఉన్నారు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కుటుం బీకులు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారిం చారని చెప్పారు. ఆంజనేయులు తల్లి పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమణయ్య తెలిపారు. ఆంజనేయులు శరీరంపై గాయాలు ఉండటంతో ఆయన తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్టుమార్టం అనం తరం పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Feb 13 , 2024 | 12:50 AM