Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

‘ప్రకృతి వ్యవసాయంతోనే మానవాళి మనుగడ’

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:17 AM

మానవాళి మనుగడ ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమని ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేఖర్‌ శిశ్యుడు విజయరామ్‌ అన్నారు.

‘ప్రకృతి వ్యవసాయంతోనే మానవాళి మనుగడ’

గోస్పాడు, మార్చి 3: మానవాళి మనుగడ ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమని ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేఖర్‌ శిశ్యుడు విజయరామ్‌ అన్నారు. ఆదివారం గోస్పాడులోని చిరుధాన్యాల ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ఎక్కడా నష్టపరచకుండా వ్యవసాయ చేయగలిగితే ప్రకృతి కూడా రైతులకు సహకారం అందిస్తుందని తెలిపారు. రైతులు పరిసరాలలో దొరికే వస్తువులతో సూక్ష్మ వ్యవసాయం చేయాలని అన్నారు. ప్రతి రైతు దేశవాలి విత్తనాలు వాడాలని, ఊరగాయలు, ఆకు కూరలు, విత్తనాలు దేశవాలి వాడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. మనిషి ఆరోగ్యంగా లేకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుందన్నారు. ప్రతి ఇంటి దగ్గర కిచెక్‌ గార్డెన్‌ వేసుకొని సొంతంగా ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రకృతి ప్రేమికులు దిలీప్‌, సంఘం ప్రధాన కార్యదర్శి రాజేష్‌రెడ్డి, సీనియర్‌ శాస్త్రవేత్త ధనలక్ష్మి, జిల్లా అగ్రికల్చర్‌ అధికారి మోహన్‌రావు, జిల్లా ప్రొగ్రామ్‌ మేనేజర్‌ సురేంద్రారెడ్డి, అడిషనల్‌ డీపీఎం సలీంబాషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:17 AM