Share News

సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:38 AM

జిల్లాలోని పోలీస్‌ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎస్పీ రఘువీర్‌రెడ్డి చెప్పారు.

సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ
సిబ్బంది సమస్యలు వింటున్న ఎస్పీ రఘువీర్‌రెడ్డి

నంద్యాల క్రైం, ఫిబ్రవరి 16: జిల్లాలోని పోలీస్‌ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎస్పీ రఘువీర్‌రెడ్డి చెప్పారు. నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్‌ సిబ్బంది సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌డేను నిర్వహించారు. ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ సిబ్బంది వారి మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌, రిక్వెస్ట్‌ బదిలీ గురించి ఎస్పీకి విన్నవించారు. సిబ్బంది సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని ఎస్పీ భరోసా కల్పించారు. ఎస్బీ డీఎస్పీ సంతోష్‌, ఆర్‌ఎస్‌ఐ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:38 AM