Share News

మానవ అక్రమ రవాణాను అరికడదాం

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:46 AM

మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి సమష్టి కృషి చేయ్యాలని ఆదోని డీఎస్పీ సోమన్న, ఎమ్మెల్సీ మధుసూదన్‌ కోరారు.

మానవ అక్రమ రవాణాను అరికడదాం
ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎస్పీ సోమన్న, ఎమ్మెల్సీ మధుసూదన్‌

ఆదోని అగ్రికల్చర్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి సమష్టి కృషి చేయ్యాలని ఆదోని డీఎస్పీ సోమన్న, ఎమ్మెల్సీ మధుసూదన్‌ కోరారు. శనివారం ఆర్ట్స్‌ కళాశాలలో ఢిల్లీకి చందిన ది మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్‌, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంట్లో మానవ హక్కుల ఉల్లంఘనతో అమాయకులు జీవితాలు బలి అవుతున్నాయన్నారు. రోజూ ఎనిమిది మంది అపహరణకు గురవుతున్నారని, 90శాతం అమ్మాయిలు మహిళలే ఉన్నారన్నారు. కళాశాల విద్యార్తినులు జాగ్రత్త వహించాలని, చైతన్యవంతులు కావాలని సూచించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఫేయిత్‌ హోమ్‌ నిర్వాహకులు డాక్టర్‌ డానియల్‌ ప్రేమ్‌ కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ బాలస్వామి, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి జోనాథన్‌, ఉమాదేవి, వెంకటాంరెడి,్డ ఎన్‌సీసీ అధికా రులు కెప్టెన్‌ గోవిందు, వీరమ్మ, అధ్యాపకులు ప్రేమ్‌ కుమార్‌, మనోజ్‌, సలోమి, అనిత, ఉషా పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:46 AM