Share News

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: టీడీపీ

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:27 AM

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జయసూర్య అన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: టీడీపీ
నందికొట్కూరులో ప్రచారం చేస్తున్న జయసూర్య

కొత్తపల్లి, ఫిబ్రవరి 1: టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జయసూర్య అన్నారు. మండలంలోని శివపురం, సమీపంలోని గిరిజనగూడెంలో ఆ పార్టీ మండల కన్వీనర్‌ నారపురెడ్డి, క్లస్టర్‌ ఇన్‌చార్జి లింగస్వామి గౌడు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారు కొలనుభారతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిపెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వం వస్తే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించారు. జయసూర్య మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు జగన్‌ మోసపూరిత హామీలు ఇచ్చి.. నేడు మడమ తిప్పారన్నారు. నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌ రెడ్డి, జడ్‌ వెంకటరెడ్డి, పలుచాని మహేశ్వరరెడ్డి, బుచ్చిరెడ్డి, వెంకటస్వామి రెడ్డి, జానకీరాముడు, గోకవరం స్వామిరెడ్డి, రామసుబ్బయ్య, చంద్రగౌడు, నాగార్జునగౌడు, అంబయ్య, రాధాకృష్ణారెడ్డి, పరమేశ్వరరెడ్డి, సీలం లింగన్న, శివారెడ్డి, పోతుల నారాయణ, మారెన్న, మాడుగుల శేఖర్‌, సుధాకర్‌, రామలింగ నాయుడు, జిలాని బాషా, చాంద్‌బాషా, షఫీవుల్లా, వెంకటస్వామి పాల్గొన్నారు.

నందికొట్కూరు: జగన్మోహన్‌రెడ్డి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గిత్తా జయసూర్య అన్నారు. గురువారం పట్టణంలోని 18వ వార్డులో పట్టణ కన్వీనర్‌ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. జయసూర్య మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించామన్నారు. చెత్తపై కూడా పన్ను వేసిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, నందికొట్కూరు, పట్టణ నాయకులు జకీర్‌ హుస్సేన్‌, ముర్తుజావలి, షకీల్‌ అహ్మద్‌, మోహన్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, శెట్టి రవి, చిన్న పుల్లారెడ్డి, రవి, నిమ్మకాయల రాజు, సత్తార్‌, పట్టణ మహిళా అధ్యక్షురాలు మీనాక్షిదేవి, లక్ష్మీ, రూబియా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:27 AM