Share News

చెక్‌పోస్టుల్లో ప్రత్యేక నిఘా ఉంచాలి

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:21 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులలో ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ జి. కృష్ణకాంత్‌ అన్నారు.

చెక్‌పోస్టుల్లో ప్రత్యేక నిఘా ఉంచాలి

ఎస్పీ జి. కృష్ణకాంత్‌

గూడూరు ఏప్రిల్‌ 26: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులలో ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ జి. కృష్ణకాంత్‌ అన్నారు. శుక్రవారం ఆంధ్ర-తెలంగాణ బార్డర్‌ జిల్లా సరిహద్దు సుంకేసుల చెక్‌పోస్టును ఎస్పీ జి.కృష్ణకాంత్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు అక్రమ రవాణా జరగకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు చెక్‌పోస్టుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు, సెబ్‌ పోలీసులు, లోకల్‌ పోలీసులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఆంధ్ర, తెలంగాణ బార్డర్‌ చెక్‌పోస్టులలో ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం, అక్రమ రవాణా జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు లభ్యమైతే సీజ్‌ చేసి అధికారులకు అప్పగించాలన్నారు. ఎస్పీ వెంట స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, సెబ్‌ సీఐ మల్లిక, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ శ్యామల, గూడూరు ఎస్‌: హనుమంతయ్య ఉన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:21 PM