Share News

నేటి నుంచి ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:20 AM

సంక్రాంతికి కోవెలకుంట్ల నుంచి హైదరాబాదుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కోవెలకుంట్ల ఆర్టీసీ డిపో మేనేజరు తిరుపతయ్య తెలిపారు.

నేటి నుంచి ప్రత్యేక బస్సులు

కోవెలకుంట్ల, జనవరి 10: సంక్రాంతికి కోవెలకుంట్ల నుంచి హైదరాబాదుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కోవెలకుంట్ల ఆర్టీసీ డిపో మేనేజరు తిరుపతయ్య తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గురువారం నుంచి ఈనెల 13 వరకు కోవెలకుంట్లకు చెందిన ఆర్టీసీ బస్సులు హైదరాబాద్‌ నుంచి కోవెలకుంట్లకు నడుపుతున్నామని చెప్పారు. తిరిగి 16వ తేదీ కోవెలకుంట్ల నుంచి హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌ వరకు నడపనున్నట్లు వివరించారు. 11న రెండు బస్సులు, 12న 5 బస్సులు, 13న 4 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. తిరిగి 16వ తేదీ నుంచి బీహెఈఎల్‌కు 2 బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. చార్జీలు పెంచడం లేదని చెప్పారు. రిజర్వేషన్‌ సౌకర్యం ఉందన్నారు. రాను పోను రిజర్వేషన్‌ చేసుకుంటే పది శాతం రాయితీ కల్పించనున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 11 , 2024 | 12:20 AM