Share News

సమస్యలను పరిష్కరించండి

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:48 AM

ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.

సమస్యలను పరిష్కరించండి
వినతి పత్రాలను స్వీకరిస్తున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ఆదోని, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.

మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని

1.పట్టణంలోని 19వ వార్డుకు చెందిన యశోద తాను టిడ్కో గృహానికి రూ.లక్ష డీడీ ఇచ్చానని, మంజూరు చేయాలని అర్జీ ఇచ్చారు.

2. దిబ్బనకల్లు సర్వేనెంబర్‌ 3/బీలో 3.75 ఎకరాలు ఉండగా రీ సర్వేలో 32సెంట్లు తక్కువగా చూపుతోందని న్యాయం చేయాలని ఆదోని మండలం నెట్టకల్లు గ్రామానికి చెందిన మల్లన్న అర్జీ ఇచ్చారు.

3. ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన లక్ష్మి తనకు సర్వే నెంబర్‌ 163లో 2.97 ఎకరాలు ఉండగా, రీ సర్వేతో 2.37మాత్రమే భూమి చూపుతోందని న్యాయం చేయాలని కోరారు.

4. సర్వే నెంబర్లు 38, 39లలో 4.09 ఎకరాలు ఉందని, సర్వే చేసి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన రంగప్ప అర్జీ సమర్పించారు. సర్వేయర్లు శ్రీనివాస రాజు, వేణు సూర్య, డీఎల్‌పీవో నూర్జహాన్‌, హౌసింగ్‌ డీఇ రవి కుమార్‌, డిప్యూటీ డీఈవో వెంకటరమణారెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్‌ మహ్మద్‌ రఫీ, ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ చేతన్‌ ప్రియ పాల్గొన్నారు.

నేషనల్‌ నర్సింగ్‌ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి

ఆదోని అగ్రికల్చర్‌: పటణంలోని నేషనల్‌ నర్సింగ్‌ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ పట్టణ కోశాధికారి శేఖర్‌ కోరారు. సోమవారం సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజకు వినతిపత్రం అందజేశారు. యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక వసూళ్లు చేస్తున్నారని, గతంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో విచారణ చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

Updated Date - Dec 31 , 2024 | 12:48 AM