Share News

వైభవంగా సీతారాముల కల్యాణం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:57 AM

డోన్‌ పట్టణంలోని పాతపేట శ్రీరాములోరి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది.

వైభవంగా సీతారాముల కల్యాణం
బేతంచెర్లలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న పురోహితులు

డోన్‌(రూరల్‌), ఏప్రిల్‌ 17: డోన్‌ పట్టణంలోని పాతపేట శ్రీరాములోరి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో కేవీఎస్‌ హాస్పిటల్‌ అధినేత కోట్రికే శ్రీధర్‌ దంపతులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త హరికిషణ్‌ కోట్రికే హరికిషణ్‌ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం జరిగింది. పట్టణంలోని పాతపేట రాముల ఆలయంలో శ్రీరామనవమి వేడుకల్లో డోన్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పాల్గొని పూజలు చేశారు. అలాగే పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆల యంలో శ్రీమన్నారాయణ కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయంలో ము త్యాల తలంబ్రాలతో శ్రీరామ అనే పదంతో అమర్చిన అక్షరాలు భక్తులను ఆక ట్టుకున్నాయి. కార్యక్రమంలో డోన్‌ టీడీపీ నాయకులు ఓంప్రకాష్‌ పాల్గొన్నారు.

బనగానపల్లె: మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం శ్రీరా మనవమిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆల యంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తుల సమక్షంలో పూజారి ఆనంద ప్రసాద్‌ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిగింది. సీతమ్మ తరపున నూకల విజయకుమార్‌, నూకల వాసంతి దంపతులు, శ్రీరాముడి తరపున సోమశేఖర్‌, స్వర్ణ దంపతులు పాల్గొన్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఎస్‌ఆర్‌బీసీ కాలనీలోని సాయిబాబా ఆలయం లో శ్రీరామనవమి పండుగ సందర్భంగా చందనోత్సవం నిర్వహించారు.

బేతంచెర్ల: నంద్యాల రహదారిలోని పలక చింతామణి ఆంజనే యస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. అలాగే కొలుములపల్లి రస్తాలోని ఆంజనేయస్వామి ఆలయం ప్రాంగణంలో సీతారాముల కల్యాణాన్ని నిర్వ హించారు. మండలంలోని కొలుములపల్లె, ఆర్‌.బుక్కా పురం తదితర గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కొలిమిగుండ్ల: మండల కేంద్రమైన కొలిమిగుండ్లలోని సీతరామస్వామి ఆలయంలో ధర్మకర్త మారికె నరసింహులు ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురోహితులు ఆలూరి నరసింహ ప్రసాద్‌ సీతరాములకు కళ్యాణం నిర్వహించారు.

సంజామల: మండల కేంద్రమైన సంజామల తోట వీధిలో వెలసిన కోదండ రాముల వారికి ఉదయం ప్రజలు పూజలు చేశారు. ఆలయాల్లో సీతారాముల కళ్యాణం జరిపించారు. గ్రామ పెద్దలు రఘురామయ్య, బండారు క్రిష్ణమూర్తి స్వామివారి కళ్యాణం వైభవంగా జరిపించారు.

కోవెలకుంట్ల: మండలంలోని గుళ్ళదుర్తి గ్రామంలోని సీతరామ ఆశ్రమంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. పూసల వీధిలో శ్రీరామ ఆలయంలో ప్రజలు సీతరాముల కళ్యాణం నిర్వహించారు. వీటితోపాటు సౌదరదిన్నె, అమడాల, గుంజలపాడు, వెలగటూరు , బిజిన వేముల ,వలం్లపాడు, రేవనూరు, లింగాల, కలుగోట్ల, పొట్టిపాడు గ్రామాల్లో ప్రజలు శ్రీరామ నవమి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

ఉయ్యాలవాడ: మండలంలోని అన్ని గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. హరివరం, సర్వారుపల్లె, ఉయ్యాల వాడలోని రామాలయంలో ప్రధాన అర్చకుడు సురేష్‌శర్మ ఆధ్వర్యంలో సీతా రాముల కల్యాణం జరిపించారు. ఎంపీడీవో రఘురామ్‌ దంపతులు స్వాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆర్‌.జంబులదిన్నె గ్రామం లోని మెట్ట వద్ద వెలసిన ఆంజనేయస్వామికి అర్చకడు కీర్తి లక్ష్మణస్వామి స్వా మివారికి పూజలు చేశారు. అర్చకులు రవిశర్మ, మోహనకృష్ణ పాల్గొన్నారు.

అహోబిలంలో అభిషేకం

అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శ్రీరామనవమి పండుగను పురష్కరించుకొని వేదపం డితులు సీతారామలక్ష్మణ సమేత హనుమంతు ఉత్సవ విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. ముందుగా సీతారామలక్ష్మణ, హనుమంతు ఉత్సవ విగ్రహాలను వేకువజామున్నె విశేషంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు.

శిరివెళ్ల: మండలంలోని గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలను ప్రజలు బుధవారం వైభవంగా జరుపుకొన్నారు. యర్రగుంట్ల రామాలయంలో ఉత్స వాల్లో భాగంగా గ్రామానికి చెందిన ఓనమాల సీతారామయ్య, నుగ్గు సుబ్ర హ్మణ్యం కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించగా సీతారాముల ఉత్సవమూర్తులకు అర్చకులు కల్యాణం నిర్వహించారు. వెంకటాపురం, గోవిందపల్లె, కోటపాడు తదితర గ్రామాల్లో స్వామి అమ్మవార్ల కల్యాణం, భక్తులకు పానక, పందేరం, అన్నదాన వితరణ నిర్వహించారు.

రుద్రవరం: మండలంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా బుధవారం కన్నులపండువలా సీతారామ కల్యాణం నిర్వహించారు. తువ్వ పల్లె, రుద్రవరం, లింగందిన్నె గ్రామ సమీపంలోని భజనపల్లె, దక్షిణకొట్టాల, మందలూరు గ్రామాల్లో సీతారామల కల్యాణం నిర్వహించారు. తువ్వపల్లెలో మాజీ జడ్పీటీసీ, టీడీపీ మండల కన్వీనర్‌ ఎల్‌వీ రంగనాయకులు, ప్రమీలమ్మ దంపతుల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు.

దొర్నిపాడు: మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం శ్రీరామ నవమి పురష్కరించుకొని సీతారాముల కల్యాణం కమణీయంగా జరిగింది. రామచంద్రాపురం, దొర్నిపాడు, భాగ్యనగరం, క్రిష్టిపాడు, అమ్మిరెడ్డినగర్‌, చాకరాజువేముల తదితర గ్రామాల్లోని ఆలయాల్లో సీతారాము కల్యాణం వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులకు అర్చకులు పానక పందారం అందజేశారు.

చాగలమర్రి: మండలంలోని చింతలచెరువు, కొలుములపేట, చిన్నవంగలి, మూడురాళ్లపల్లె, చాగలమర్రి గ్రామాల్లో సీతారాములకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సీతారాముల పల్లకితో ఊరేగింపు చేశారు. ఆయా దేవాలయాల వద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 18 , 2024 | 12:57 AM