మహానందీశ్వరుడికి వెండి పాత్ర
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:22 AM
మహానంది క్షేత్రంలోని ప్రధాన గర్భాలయంలో ఉపయోగించే 1.25 కేజీల బరువు గల వెండి ధార పాత్రను నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య, శమంతకమణి దంపతులు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డికి ఆదివారం అందచేశారు.
మహానంది, మార్చి 3: మహానంది క్షేత్రంలోని ప్రధాన గర్భాలయంలో ఉపయోగించే 1.25 కేజీల బరువు గల వెండి ధార పాత్రను నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య, శమంతకమణి దంపతులు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డికి ఆదివారం అందచేశారు. అర్చకులు సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన గర్భాలయంలో భక్తులు ఇచ్చిన వెండి ధార పాత్రను ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వేదపండితులు రవిశంకర్ అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్ళపల్లి అర్జునశర్మ, రఘు శర్మ పాల్గొన్నారు.