Share News

మహానందిలో శ్రావణ మాస శోభ

ABN , Publish Date - Aug 19 , 2024 | 12:53 AM

మహానంది క్షేత్రం శ్రావణమాస శోభతో కళకళలాడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు వివాహాలకు మంచి ముహూర్తం ఉండటంతో పదుల సంఖ్యలో నూతన జంటలు ఒక్కటయ్యాయి.

 మహానందిలో శ్రావణ మాస శోభ
మహానందిలో దర్శనం కోసం క్యూలో నిల్చొన్న భక్తులు

మహానంది, ఆగస్టు 18: మహానంది క్షేత్రం శ్రావణమాస శోభతో కళకళలాడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు వివాహాలకు మంచి ముహూర్తం ఉండటంతో పదుల సంఖ్యలో నూతన జంటలు ఒక్కటయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు శనివారం రాత్రే మహానందికి చేరుకోవడం జరిగింది. తెల్లవారుజాముననే ఆలయ ప్రాంగణంలోని కోనేర్లల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పరమశివుని ఽధర్శనం కోసం క్యూలో నిల్చొవడం జరిగింది. కాగా శ్రావణమాసంలో పెళ్ళిళ్లలకు మంచి ముహూర్తం ఉండటంతో పెళ్లిళ్ళు అధికంగా జరిగాయి. దీంతో మహానందిలో అటు భక్తుల సందడి,ఇటు పెళ్ళి బృందాల కోలాహాలంతో నిండిపోయింది. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కల్గకుండా ఏఈఓ ఎర్రమల్ల మధు ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయంలో పర్యవేక్షించించడం జరిగింది.

ఎస్‌బీఐ డీజీఎం పూజలు

మహానంది క్షేత్రంలో ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రాహూల్‌ సంక్రేత్‌ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయం ముఖద్వారం వద్ద ఏఈఓ ఎర్రమల్ల మధు ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు డీజీఎం అభిషేకార్చనలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో వేదపండితులు వీరిని ఆశీర్వదించారు. ఏఈవో శాలువాతో సన్మానించారు. వీరివెంట ఏజీఎం రాజశేఖర్‌, మేనేజర్లు శ్రీవత్స, కేశవ, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 12:53 AM