Share News

పరిమితి దాటగానే దుకాణాలు బంద్‌

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:05 AM

మద్యం అమ్మకాలపై పరిమితి నిర్ణయం బెల్టు షాపు నిర్వాహకులకు వరంగా మారింది.

పరిమితి దాటగానే దుకాణాలు బంద్‌

సమయం కాకముందే

మద్యం అమ్మకాల నిలిపివేత

ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ చర్యలు

కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 13: మద్యం అమ్మకాలపై పరిమితి నిర్ణయం బెల్టు షాపు నిర్వాహకులకు వరంగా మారింది. మందుబాబులకు మాత్రం జేబుకు చిల్లుపడుతోంది. మామూలుగా అయితే ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాలు తెరిచి రాత్రి 9 గంటలకు మూసేయాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో మద్యం పక్కదారి పట్టకుండా కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ అధికారులకు పరిమితులు విధించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత ఏడాది ఏప్రిల్‌లో ప్రతి దుకాణంలోని అమ్మకాల లెక్కలు చూసి ఆ మేరకు మద్యం అమ్మకాలు చేయాలి. ఆ తరువాత దుకాణాలను మూసివేయాలి. దీంతో ఆ ప్రకారం అమ్మకాల టార్గెట్‌ పూర్తయి ముందుగానే దుకాణాలను మూసేస్తున్నారు. దీంతో మందుబాబులు తలపట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరిమితులతోనే మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. బార్లలో మత్రం ఈ నిబంధనలు ఇంకా అమల్లోకి రాకపోయినా కొద్ది రోజుల్లో అమలవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే పరిమితులతో అమ్మకాలు సాగించి., మద్యం దుకాణాలు మూసివేస్తుండటంతో మందుబాబులకు ఇబ్బందులు తప్పవని ఎక్సైజ్‌ అధికారులు గుర్తించి విక్రయాలను మరో 20 శాతం పెంచేలా చర్యలు చేపడుతున్నారు.

విచ్చల విడి గా బెల్టు షాపులు

మద్యం అమ్మకాలపై అధికారులు నిబంధనలు విధించడంతో మందు బాబులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో బ్లాక్‌లో మద్యం కోనేందుకు. బార్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన పలువురు ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది మందుగానే మందను కొనుగోలు చేసి దుకాణాలు మూసివేశాక బెల్టు దుకాణాలకు పక్కనే కూల్‌ డ్రింక్స్‌ దుకాణాల వ్యాపారులు బెల్టు దుకాణాలుగా మార్చుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్థానిక పోలీసులు, సెబ్‌ అధికారులు, సిబ్బంది మామూళ్ల మత్తులో మునుగుతూ వాటి వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి.

విచ్చల విడిగా పక్క రాష్ట్రాల మద్యం..

జిల్లాలోకి పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మద్యం అక్రమంగా జిల్లాలోకి చేరుతోంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 14.50 లక్షల మద్యం స్పెషల్‌ ఎన్ఫోర్సుమెంట్‌ బ్యూరో అధికారుల తనిఖీల్లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో జిల్లాలోని ఇతర రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో నిత్యం పక్క రాష్ట్రాల మద్యం పట్టు బడం ఇందుకు బలం చేకూరుస్తోంది. బెల్టు షాపుల దందా జోరుగా సాగుతుండటంతో ఉన్నతాధికారులు సైతం నివ్వెరపోతున్నారు. ఎన్నడూలేని విధంగా బెల్టు షాపులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉండటంతో వాటిని నిర్మూలించాల్సిన పోలీసు, సెబ్‌ మామూళ్లతో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

పరిమితులు మించరాదు

మద్యం అమ్మకాల్లో పరిమితులు మించరాదనే నిబంధనలు ఉన్నాయి. పరిమితులకు మించి అమ్మితే ఆయా ప్రాంతాల్లో జాతర, లేక వేడుకలు ఉంటే ఆ విషయాన్ని చూపాల్సి ఉంటుంది. గత ఏడాది అమ్మకాల ఆధారంగానే అమ్మకాలు చేయాల్సి ఉంది. ఈ మేరకు అమ్మకాలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల ప్రభావం మద్యంపై ఉండ కూడదనే నిబంధన కిందికి అమ్మకాలు వస్తాయి. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఉండ కూడదనే ఎన్నికల కమిషన్‌ నిబంధన తెరపైకి తె చ్చింది.

-సుధీర్‌బాబు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

Updated Date - Apr 14 , 2024 | 12:05 AM