Share News

కల్లూరు అర్బన్‌లో వైసీపీకి షాక్‌

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:54 PM

పాణ్యం నియోజకవర్గంలో వైసీపీకి షాక్‌ తగిలింది. కల్లూరు అర్బన్‌ 28 వార్డులో వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీలో చేరారు.

కల్లూరు అర్బన్‌లో వైసీపీకి షాక్‌

గౌరు దంపతుల సమక్షంలో టీడీపీలో చేరిక

కల్లూరు, ఏప్రిల్‌ 5: పాణ్యం నియోజకవర్గంలో వైసీపీకి షాక్‌ తగిలింది. కల్లూరు అర్బన్‌ 28 వార్డులో వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీలో చేరారు. శుక్రవా రం పందిపాడులోని బీఆర్‌రెడ్డి కాలనీకి చెందిన వైసీపీ నాయకులు జయ మోహన్‌ రెడ్డి, రమణమ్మ, వసంతి, వెంకటేశ్వరమ్మతోపాటు 70 కుటుంబాలు పాణ్యం టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు టీడీపీ ఇన్‌ చార్జి గౌరు వెంకటరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి గౌరు దంపతులు ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చ క టీడీపీలో చేరిన ట్లు వారు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో శ్రీనివాసులు, రవి, అనిల్‌, భాను, సురేష్‌, శంకర్‌, ఎల్ల రాజు, శేఖర్‌, శేషమ్మ, వెన్నెల, సుచిత్ర ఉన్నారు. కార్యక్రమంలో పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్‌, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్‌ ఆకెపోగు వెంకటస్వామి, పుసులూరు ప్రభాకర్‌రెడ్డి, జె.గంగా ధర్‌గౌడ్‌, కల్లూరు మాజీ సింగిల్‌విండో చైర్మన్‌ ఎన్వీ. రామకృష్ణ, శేఖర్‌చౌదరి, అయ్యపురెడ్డి, శంకర్‌రెడ్డి, కాసాని మహేష్‌గౌడ్‌, శ్రీరాములు పాల్గొన్నారు.

టీడీపీ కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి: టీడీపీ కూటమి అధికారం లోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పాణ్యం టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శుక్రవారం కల్లూరు అర్బన్‌ 34వ వార్డు నిర్మల్‌నగర్‌లో ఆమె శంఖారావంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని మేని ఫేస్టో పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ వైసీపీపై విసుగు చెందిన ప్రజలు టీడీపీ కూటమికి పట్టం కట్టనున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కోశాధికారి పీయూ మాదన్న, లోకేష్‌గౌడ్‌, బీసన్న, దిలీప్‌, భాస్కర్‌గౌడ్‌, రాజశేఖర్‌గౌడ్‌, నవీన్‌, శివ, తులసి, జె.గంగాధ ర్‌గౌడ్‌, నాగ రాజు, సోమన్న. కె.ధనుంజయ, చిన్న బీచుపల్లి, టైలర్‌ నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:54 PM