Share News

భక్తి శ్రద్ధలతో శివరాత్రి

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:40 AM

నంద్యాల జిల్లాలో మహా శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

భక్తి శ్రద్ధలతో శివరాత్రి
బేతంచెర్లలో మల్లికార్జునస్వామికి పూజలు చేస్తున్న భక్తులు

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

నంద్యాల జిల్లాలో మహా శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి పూజలు చేశారు.

ఆళ్లగడ్డ, మార్చి 8: ఆళ్లగడ్డ పట్టణంతోపాటు గ్రామాల్లో శివరాత్రి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శివపార్వతులకు అభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని అమృతలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు వేకువజామున్నే శివునికి పూజలు చేసేందుకు బారులు తీరారు. శివాలయా ల్లో రాత్రి పొద్దుపోయాక శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.

చాగలమర్రి: మండలంలోని రామలింగేశ్వర, బుగ్గమల్లేశ్వర, భైరవీశ్వర ఆలయాల్లో శుక్రవారం మహాశివరాత్రి పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు ఆలయాల్లో శివపార్వతులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశా రు. వేద పండితుల ఆధ్వర్యంలో మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. శివపార్వతుల ఉత్సవమూర్తుల పల్లకీ ఉత్సవం నిర్వహించారు. బుగ్గమల్లేశ్వర ఆలయంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయాల అధ్యక్షుడు శివప్రసాద్‌, రామసు బ్బారెడ్డి, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

డోన్‌(రూరల్‌): మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణ సమీపంలోని పాతబుగ్గ, కొత్తబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో భక్తు లు ప్రత్యేక అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తబుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త కోట్రికే హరికిషణ్‌, పాతబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త భైసాని రాజు, నిర్వాహకులు పుల్లగూడ నాగరాజు, భైసాని నరసింహయ్య ఆధ్వర్యంలో ఆలయాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో రాత్రి సహస్ర దీపోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.

బేతంచెర్ల: మహాశివరాత్రి పురస్కరించుకుని హెచ్‌. కొట్టాల గ్రామ సమీపంలోని కొండల నడుమ వెలసిన ప్రముఖ శైవ క్షేత్రమైన ముచ్చట్ల మల్లికార్జున, భ్రమరాంబ దేవి క్షేత్రంలో స్వామివారికి అభిషేకాది పూజలు చేశారు. అదే విధంగా మండలంలోని ఎంబాయి గ్రామంలో వెలసిన భోగే శ్వరం పట్టణంలోని బోయపేటలోని శివాలయం, సిద్దప్ప దేవాలయం, గౌరి పేటలో వెలసిన పూదోట మఠంలో అమ్మవారిశాలలో వెలసిన శివలింగాలకు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు.

కోవెలకుంట్ల: మండలంలోని శివాలయాలు శుక్రవారం భక్తులతో కిట కిటలాడాయి. తెల్లవారుజాము నుంచే అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషే కాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధికసంఖ్యలో శివాల యాలకు చేరుకొని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల ఆవ రణలో దీపాలు వెలిగించారు. అనంతరం అర్చకులు భక్తులకు మంగళ హారతి, తీర్థప్రసాదాలు అందించారు.

సంజామల: శివరాత్రిని పురస్కరించుకొని మండలంలోని పేరుసోముల, ఆకుమళ్ల, గిద్దలూరు, కానాల, సంజామల, నయనాలఫ్ప క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సంజామలలోని కోటవీధిలో కొలు వుదీరిన నీలకంఠేశ్వరుడి ఆలయంలో పార్వతి, పరమేశ్వరులకు భక్తులు కాయ కర్పూరం సమర్పించారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను గ్రామంలో ఊరే గించి గ్రామోత్పవం నిర్వహించారు. పేరుసోములలో మాధవ చంద్రశేఖ ర్‌రావు అధ్యక్షతన శివుడికి పూజలు నిర్వహించారు. రాత్రి లింగోధ్భవంలో భాగంగా శివుడికి ప్రజలు ప్రత్యేక అభిషేకాలు చేశారు.

Updated Date - Mar 09 , 2024 | 01:40 AM