Share News

చరిత్రలో నిలిచిపోయేలా ఇసుక పాలసీ

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:02 AM

చరిత్రలో నిలిచేపోయేలా ఇసుక పాలసీ అమలుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.

చరిత్రలో నిలిచిపోయేలా ఇసుక పాలసీ

వైసీపీ నాయకుల అరాచకాలను నిగ్గు తేల్చాలి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు(అర్బన్‌), జూలై 7: చరిత్రలో నిలిచేపోయేలా ఇసుక పాలసీ అమలుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందుకు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ అమలుకు ఈనెల 8 నుంచి శ్రీకారం చుట్టారన్నారు. ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర అభివృద్ధిలో భాగమేనన్నారు. టన్ను ఇసుక కేవలం రూ.335కు డంప్‌ల వద్ద నుంచి తీసుకెళ్లవచ్చన్నారు. అదే గ్రామాల పరిధిలోని వాగులు, వంకల్లో ఉచితంగా ఇసుక గతంలోగే తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఇసుక వల్ల నిర్మాణం రంగంపై ఆధారపడిన కార్మికులకు పనులు దొరు కుతాయన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లా డుతూ గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు చేసిన ఆరాచకాలపై నిగ్గుతే ల్చాల్సిన అవసరం ఉందన్నారు. జైలు, బెయిల్‌, విదేశాల్లో తలదాచుకునే పరిస్థితుల్లో జగన్‌ అనుచరులు పారిపోయారని ఎద్దేవ చేశారు.

చంద్రబాబు నాయకత్వాన పని చేయడం అదృష్టం

అధికారులు, మంత్రులను వెంటపెట్టుకుని వెళ్లి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను చంద్రబాబు కోరుతున్నారని, అలాంటి నాయకుడితో పని చేయడం అదృష్టమని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. రాష్ట్రంపై ఎంతో బాధ్యతతో సీఎం చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో నిరంతరం టచ్‌లో ఉంటూ రాష్ట్రానికి పనులు చేసి పెట్టాలని తమకు బాధ్యతలు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. రాయలసీమను కోస్తాలో పోటి పడే తీరులో ప్రాజెక్టుల తీసుకోచ్చి యువతకు ఉపాధి, రైతులకు నిరతరం నీటి సౌకర్యం కల్పించేకు అసరమైన ప్రణాళికలతో పని చే స్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు ముంతాజ్‌, కేవీ సుబ్బారెడ్డి, హనుమంతరాయచౌదరి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- ఎంపీ బస్తిపాటి నాగరాజు

Updated Date - Jul 08 , 2024 | 12:02 AM