Share News

ఘర్షణలో వ్యక్తి మృతి

ABN , Publish Date - May 08 , 2024 | 12:47 AM

ఆత్మకూరు మండల పరిధిలోని కరివేన గ్రామంలో వర్షపు నీరు ప్రవహించే విషయంపై ఇరువురు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది.

ఘర్షణలో వ్యక్తి మృతి

ఆత్మకూరు రూరల్‌, మే 7: ఆత్మకూరు మండల పరిధిలోని కరివేన గ్రామంలో వర్షపు నీరు ప్రవహించే విషయంపై ఇరువురు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. కరివేన గ్రామంలో మంగళవారం తెల్లవారుఝామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించకుండా బర్నాల శ్రీనివాసులు అనే వ్యక్తి రోడ్డుపై మట్టి, రాళ్ళతో అడ్డుకట్ట వేశాడు. దీంతో ఈ నీరు అతని పక్కనే ఇంట్లో నివాసముంటున్న బండగార్ల వెంకటేశ్వర్లు(52) ఇంట్లోకి ఈ నీరు ప్రవహిస్తుండటంతో దానిని తొలగించేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. బాధితున్ని కుటుంబ సభ్యులు ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ పరీక్షించిన వైద్యులు వెంకటేశ్వర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకటేశ్వర్లు భార్య లక్ష్మి ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటనారాయణ రెడ్డి తెలిపారు.

Updated Date - May 08 , 2024 | 12:47 AM