కాలువలో పడి వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:15 AM
పాణ్యం ఎస్సార్బీసీ మెయిన్ కాల్వలో పడి ఆలమూరు గ్రామానికి చెందిన బి. వెంగమ్మ(65) మృతి చెందినట్లు పాణ్యం పోలీసులు తెలిపారు.

పాణ్యం, మార్చి 5: పాణ్యం ఎస్సార్బీసీ మెయిన్ కాల్వలో పడి ఆలమూరు గ్రామానికి చెందిన బి. వెంగమ్మ(65) మృతి చెందినట్లు పాణ్యం పోలీసులు తెలిపారు. మంగళవారం మృతదేహం కాలువలో ఉండగా స్థానికులు గుర్తించి సమాచారం అందించినట్లు తెలిపారు. ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని చెప్పారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.