వ్యక్తిపై కత్తితో దాడి
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:08 AM
నంద్యాల పట్టణానికి చెందిన రాజు అనే వ్యక్తిని పెద్దకొట్టాలకు చెందిన రాముడు అనే వ్యక్తి కత్తితో పొడిచాడు.

నంద్యాల క్రైం, మార్చి 5: నంద్యాల పట్టణానికి చెందిన రాజు అనే వ్యక్తిని పెద్దకొట్టాలకు చెందిన రాముడు అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ ఘటన సోమవారం రాత్రి కలకలం రేపింది. స్థానికులు వెంటనే అతడిని నంద్యాల సర్వజన వైద్యశాలకు తరలించారు. వివరాలివి.. రాజు బావమరిది ఫ్రెండ్ కోసం పెద్దకొట్టాల రాముడు దగ్గర వడ్డీకి డబ్బులు అప్పు తీసుకున్నారు. అయితే వడ్డీకి తీసుకున్న వ్యక్తి డబ్బులు కట్టకుండా పారిపోయాడు. అయితే అతడు కనిపించడంలేదని రాజు బావమరిదిని పట్టుకొని అతడి ఆటోను కొట్టాల రాముడు నిన్న రాత్రి సంజీవనగర్ సెంటర్‌లో గుంజుకున్నాడు. మధ్యవర్తితో రాజు మాట్లాడేందుకు వెళ్లగా పెద్దకొట్టాల రాముడు తన దగ్గర ఉన్న కత్తితో రాజు కడుపులో పొడిచాడు. గాయపడిన రాజును స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల సర్వజన వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.