Share News

చుక్కల దుప్పి మృతి

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:29 AM

నాగలూటి రేంజ్‌ పరిధిలోని కర్నూలు గుంటూరు రహదారిలో మంగళవారం రాత్రి పోతురాజు పెంట ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో చుక్కల దుప్పి మృతి చెందిందని నాగలూటి ఫారెస్ట్‌ రేంజర్‌ దొరస్వామి తెలిపారు.

చుక్కల దుప్పి మృతి

ఆత్మకూరు రూరల్‌, మార్చి 7: నాగలూటి రేంజ్‌ పరిధిలోని కర్నూలు గుంటూరు రహదారిలో మంగళవారం రాత్రి పోతురాజు పెంట ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో చుక్కల దుప్పి మృతి చెందిందని నాగలూటి ఫారెస్ట్‌ రేంజర్‌ దొరస్వామి తెలిపారు. నాగలూటి రేంజ్‌లో యూడీ ఓఆర్‌ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేజీ రోడ్డు వెంట అటవీ మార్గంలో పల్లె కట్ట ప్రదేశం నుంచి దోర్నాల వరకు 30 కి.మీ. మించి వేగంతో వాహనాలు వెళ్లకూడదని ఆదేశించారు.

Updated Date - Mar 08 , 2024 | 12:29 AM