మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:28 AM
రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియామకంలో రిజర్వేషన్లను ఖరారు చేయమని కలెక్టర్లకు బాధ్యతలు అప్పజెప్పుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియామకంలో రిజర్వేషన్లను ఖరారు చేయమని కలెక్టర్లకు బాధ్యతలు అప్పజెప్పుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కర్నూలు మార్కెట్ కమిటీకి ఓసీ జనరల్‌ను ఖరారు చేశారు. ఆదోని మార్కెట్ యార్డు బీసీ అండ్ మైనార్టీ (ఉమెన్) రిజర్వేషన్ ఖరారు చేశారు. ఎమ్మిగనూరు బీసీ లేదా మైనార్టీ (జనరల్)కు ఖరారు చేశారు. ఆలూరు ఎస్సీ (జనరల్), పత్తికొండ మార్కెట్ కమిటీ ఓసీ (జనరల్)కి కేటాయించారు. అలాగే కోడుమూరు ఓసీ (ఉమెన్), మంత్రాలయం ఓసీ (మహిళ)కి ఖరారు చేస్తూ కలెక్టర్ పి. రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతిలోపు ఆయా మార్కెట్ కమిటీలకు కలెక్టర్ ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రకారం చైర్మన్లను, డైరెక్టర్లను నియమించేందుకు మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి ఆ మార్కెట్ కమిటీల పరిధిలోని ఎమ్మెల్యేల చేత ప్రతిపాదనలు తీసుకోనున్నారు.
నంద్యాల జిల్లాలో..
నంద్యాల జిల్లాలోని 8 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్ల, చైర్‌పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల మార్కెట్ కమిటీ ఓసీ (మహిళ)కు, ఆళ్లగడ్డ ఎస్సీ(మహిళ), డోన్‌కు బీసీ (మహిళ)కి ఖరారు చేస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఓసీ (జనరల్)కి, ఆత్మకూరుకు ఓసీ (జనరల్), బనగానపల్లె ఓసీ (జనరల్)కి కేటాయించారు. కోవెలకుంట్ల ఓసీ (జనరల్)కి, పాణ్యం బీసీ (మహిళ)కి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.