Share News

ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు వర్తింపజేయాలి

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:10 AM

ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల్లో రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్య క్షుడు పరుచూరి రాజేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు వర్తింపజేయాలి
ర్యాలీ నిర్వహిస్తున్న ఏఐవైఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర

కర్నూలు ఎడ్యుకేషన, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల్లో రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్య క్షుడు పరుచూరి రాజేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు రంగంలోని వివిధ ప్రభుత్వ శాఖలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మెగా డీఎస్సీ నిరుద్యోగ భృతి హామీ పేపర్లకే పరిమితమైందన్నారు. ఏఐవైఎఫ్‌ కర్నూలు జిల్లా 16వ మహాసభల సందర్భంగా సోమవారం స్థానిక అంబేడ్కర్‌ భవన నుంచి కలెక్టరేట్‌ మీదుగా సీఆర్‌ భవన వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 200 రోజులైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యో గాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన కూడా విడుదల చేయలేదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపివేయాలన్నారు. విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ యువత పట్టుదల క్రమశిక్షణతో మెలగడం ద్వారానే వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన బాబు, జిల్లా అధ్యక్షుడు కే.శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులను ప్రతి ఒక్కరికీ అందించడంలో నాడు కాంగ్రెస్‌, నేడు బీజేపీ పాలకులు విఫలమయ్యారని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప, సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు, జిల్లా కార్యదర్శి కారుమంచి, ఏఐఎస్‌ఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమన్న, షాబీర్‌ బాషా, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 01:10 AM