Share News

అక్రమ లే అవుట్‌ల తొలగింపు

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:24 AM

పాములపాడులో అక్రమంగా వేసిన లే అవుట్‌లను అధికారులు తొలగించారు.

అక్రమ లే అవుట్‌ల తొలగింపు
పాములపాడులో అక్రమ లే అవుట్‌లను తొలగిస్తున్న దృశ్యం

పాములపాడు, ఫిబ్రవరి 1: పాములపాడులో అక్రమంగా వేసిన లే అవుట్‌లను అధికారులు తొలగించారు. గురువారం ఈవోపీఆర్డీ శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, కుడా అనుమతులు లేకుండా ఎలాంటి నిబంధనలు పాటించకుండా లే అవుట్‌లు వేశారని గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి స్పందనలో ఫిర్యాదు చేశారు. ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు లేఅవుట్‌లను తొలగిస్తున్నామని అధికారి తెలిపారు. రియల్‌ వ్యాపారులు, భూ యజమానులకు నోటీసులు అందిం చామని, అయితే వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు.

Updated Date - Feb 02 , 2024 | 12:24 AM