పింఛన్‌దారుల ఆనందోత్సాహం
ABN , Publish Date - Jul 01 , 2024 | 11:48 PM
రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పెంపు చంద్రబాబుతోనే సాధ్యమైందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల (నూనెపల్లె), జూలై 1: రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పెంపు చంద్రబాబుతోనే సాధ్యమైందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పోమవారం చేపట్టారు. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసి రెడ్డి తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని 6,7,10,12,36,37,38వ వార్డుల్లో సుడిగాలి పర్యటన చేసి సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్లు అందజేశారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు శేషాద్రి గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయ ఆవరణలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
నంద్యాల టౌన్: న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఉదయమే తన సొంత 10వ వార్డులో వార్డు టీడీపీ ఇన్‌చార్జీ బోయ గోవింద నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి పింఛన్ పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ఉదయమే బొమ్మలసత్రం ప్రాంతంలో ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పంపిణీని చేశారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి కూడా ఉన్నారు. అక్కడి నుంచి మంత్రి, కలెక్టర్, కమిషనర్, తదితరులు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు.
నంద్యాల రూరల్: నంద్యాలలోని పీవీ నగర్, కానాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, భీవవరంలో టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ పింఛన్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీలను నెరవేర్చారని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని అన్నారు. శిరివెళ్ల మండలంలోని గోవిందపల్లె గ్రామంలోని సచివాలయం-1, సచివాలయం-2లోని పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డీఆర్‌డీఎ పీడీ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
గోస్పాడు: మండలంలో టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జిలు, నాయకులు అధికారులతో కలిసి వృద్ధులు, దివ్యాంగులు, వితంతుల ఇంటింటికి వెళ్లి ఫించన్ల పంపిణీ చేపట్టారు. జూలేపల్లె గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు కాటంరెడ్డి తులసీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సెం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు వృద్ధులు క్షీరాభిషేకం చేశారు. ఎంపీడీవో నాగ అనసూయ, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద నగదును పంపిణీ చేసేందుకు అటు ఎమ్మెల్యే, అధికారులు, ఇటు నాయకులు, కార్యకర్తలు ఉదయాన్నే లబ్ధిదారులకు వెళ్లి పింఛన్ అందజేశారు. నందికొట్కూరు పట్టణంలోని ఆత్మకూరు రోడ్డులోని బైరెడ్డి నగర్‌లో లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. మధ్యాహ్నం నందికొట్కూరు పట్టణంలోని కోటా వీధి, పగిడ్యాల రోడ్డులోని ట్యాంక్ ఏరియా తదితర ప్రాంతాల్లో లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ట్యాంక్ ఏరియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే జయసూర్య, మాండ్ర శివానందరెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ చంద్రబాబు పింఛన్‌దారులకు ఇచ్చిన హామీని అమలు చేసి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ ఈ సారి చంద్రబాబు పాలనలో నూతన ఒరవడిని చూస్తామనడానికి ఇది తొలిఅడుగు మాత్రమే అన్నారు. నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ సుధాకర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ రబ్బాని, కౌన్సిలర్ జాకీర్, క్లస్టర్ ఇన్‌చార్జి ముర్తుజావళి, జాకీర్, నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి విక్టర్, రిటైర్డ్ ఎస్.ఐ జాన్, జమీల్, రసూల్, డా. వనజ, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
ఒక్క చాన్స్‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ద్రోహిగా మిగిలారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లబ్ధిదారులకు నగదును నందికొట్కూరు పట్టణంలో అందజేశారు. అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాటాడారు. పెంచిన పింఛన్ నగదును తీసుకుంటూ పేద వర్గాల ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారన్నారు. పేదల పక్షపాతిగా బాబు నిలిచారన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టి రాష్ట్రం నుంచి పరారయ్యారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్‌రెడ్డిని నమ్మే స్థితిలో లేరన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైసీపీ మూలాలు ఇక్కడ ఉండకూదనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నామన్నారు. పార్టీలో చేరిన వారు కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, కాకరవాడ చిన్న వెంకటస్వామి, గుణశేఖర్‌రెడ్డి, సాహెబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు రూరల్: మండలంలోని కొణిదేల, అల్లూరు, గ్రామాలలో ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకరవ్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెరవేర్చారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దామోదరెడ్డి, ఎంపీడీవో నరేష్ కృష్ణ, మాజీ ఎంపీపీ ప్రసాదరెడ్డి, ఓబుల్ రెడ్డి, పీఎస్ గోపాల్, రవీంద్రబాబు, వీఆర్వోలు సురేష్, సుజిత సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పింఛన్ పంపిణీలో భాగంగా కొణిదేల గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే జయసూర్య, మాండ్ర శివానందరెడ్డితో పాటు నాయకులు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంతో కొణిదేలకు వచ్చారని, భవిష్యత్తులో ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఆయనకు గుర్తుచేసి గ్రామానికి పిలుచుకుని వచ్చి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
కొత్తపల్లి: ఎంపీడీవో జవహర్‌బాబు, ఎంఈవోలు శ్రీరాములు, ఇనయతుల్లా, ఏవో మహేష్, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మిగిలిన వారికి మంగళవారం పంపిణీ చేస్తామని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య హాజరవుతారని ఎంపీడీవో తెలిపారు. కొక్కెరంచలో టీడీపీ మండల కన్వీనర్ నారపురెడ్డి, శివపురంలో క్లస్టర్ ఇన్‌చార్జి లింగస్వామి గౌడు, చంద్రశేఖర్ యాదవ్, నందికుంటలో నాయకులు జహరుల్లా, కొత్తపల్లిలో సర్పంచ్ లక్ష్మీదేవి, మోహన్, లింగాపురంలో చిన్న పుల్లారెడ్డి పింఛన్ పంపిణీ చేశారు. గువ్వలకుంట్ల, వీరాపురంలో రామచంద్రారెడ్డి, కర్నాటి శివారెడ్డి, దుద్యాలలో మల్లారెడ్డి, రఫీ, ముసలిమడుగులో రామక్రిష్ణారెడ్డి, రహీంఖాన్, షఫీవుల్లా, చిన్న గుమ్మడాపురంలో రాజు, దర్గయ్య పింఛన్ అందించారు. ఎదురుపాడులో చంద్రశేఖర్ రెడ్డి, నారాయణ, పెద్దగుమ్మడాపురంలో నాగశేషన్న, శ్రీనివాస నాయక్, ఎర్రమఠంలో చంద్రారెడ్డి, పరమేశ్వరరెడ్డి, సింగరాజుపల్లిలో జడ్.వెంకటరెడ్డి, బుచ్చిరెడ్డి, వెంకటస్వామిరెడ్డి, గోకవరంలో స్వామిరెడ్డి తదితర నాయకులు ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాములపాడు: పాములపాడు, కంబాలపల్లిలో ఆళగడ్డ హరి సర్వోత్తమరావు, మధుకృష్ణ, గోవిందు, రుద్రవరంలో సురేశ్, రామకృష్ణ, జూటూరులో పూసలక్రిష్ణ, హఫీజ్, క్రిష్ణరావుపేటలో రామక్రిష్ణ, జనార్దన్, సన్నీ పింఛన్ పంపిణీ చేశారు. అలాగే తుమ్మలూరులో సత్యంరెడ్డి, ఏసేపు, అలీసాహెబ్, లింగాలలో స్వాములు, ఇస్కాలలో ఈశ్వరరెడ్డి, నాగలక్ష్మిరెడ్డి, లింగస్వామి, కలీముల్లా, ఎర్రగూడూరులో హరినాథ్‌రెడ్డి, లింగేశ్‌గౌడ్, మిట్టకందాలలో హరిప్రసాద్, మల్లికార్జునయాదవ్, మద్దూరులో తిమ్మారెడ్డి రవీంద్రరెడ్డి, బానుముక్కలలో వెంకటేశ్వరరావు పింఛన్ అందేశారు. బానకచెర్లలో చంద్రశేఖర్, వేంపెంటలో లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో పింఛన్ అంజేశారు. అన్ని గ్రామాలలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
జూపాడుబంగ్లా: మండలంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గ్రామాల్లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీడీపీ నాయకులు గిరీశ్వరరెడ్డి, మోహాన్‌రెడ్డి, వెంకటేశ్వర్లుయాదవ్, రమణారెడ్డి, రామోహ్మన్‌రెడ్డి, శ్రీనివాసులు, సుధాకర్, రవికుమార్‌యాదవ్, జంగాలపెద్దన్న, సైఫద్దీన్, బాబు, మన్సూర్‌బాషా, వెంకటరమణారెడ్డి, ప్రకాశం, పరమేశ్వరరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రవికాంత్, ఉసేనయ్య తదితరులు పాల్గొన్నారు. జూపాడుబంగ్లా వెలుగు కార్యాలయంలో మంగళవారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తజయసూర్య ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వస్తున్నారని ఎంపీడీవో నూర్జహాన్ తెలిపారు. వివిధ శాఖల అధికారులు తప్పక హాజరు కావాలన్నారు.
పగిడ్యాల: పగిడ్యాల ఎంపీడీవో కార్యాలయం వద్ద లబ్ధిదారులకు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, నంద్యాల లోక్‌సభ నియోజకరవ్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి పింఛన్ పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎంపీడీవో కవిరాజ్, తహసీల్దార్ నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు పలుచాని మహేశ్వరరెడ్డి, పుల్యాల రాజశేఖరరెడ్డి, వాసురెడ్డి, దామోదర్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గోన్నారు.
నెహ్రూనగర్ సచివాలయం వద్ద పంపిణీ సందర్భంగా టీడీపీ నాయకుడు లోకానందరెడ్డి, హేమసుందరరాజు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.
మిడుతూరు: మిడుతూరులో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానంద రెడ్డి చేతుల మీదుగా పింఛన్ పంపిణీ చేశారు. ఎంపీడీవో గంగావతి, తహసీల్దార్ తులశమ్మ, సర్పంచ్ జయలక్ష్మమ్మ, కన్వీనర్ రమేష్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రమణారెడ్డి, ఇద్రుస్, ప్రమోద్ రెడ్డి, శివరామి రెడ్డి, సర్వోత్తమ రెడ్డి పాల్గొన్నారు.
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని జీవనజ్యోతి దివ్యాంగుల కార్యాలయంలో సోమవారం దివ్యాంగులు సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, దివంగత ఎన్టీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సంఘం అధ్యక్షుడు మేడం వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
బండిఆత్మకూరు: పింఛన్ విషయంలో ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారని శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ సభ్యుడు డాక్టర్ చిట్టిబొట్ల భరద్వాజశర్మ, టీడీపీ సీనియర్ నాయకుడు సురేష్‌రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ కంచర్ల మనోహర్‌చౌదరి, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ చిన్న తింగారెడ్డి అన్నారు. పింఛన్‌దారులకు నగదును అందజేశారు. కార్యక్రమాల్లో, నరసింహారెడ్డి, మల్లీశ్వరరెడ్డి, చెన్నారెడ్డి, ఈశ్వరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నాగరాజు, వెంకటరామయ్య, బాలుడు, శంకర్‌రెడ్డి, శంకర్, మదన్‌భూపాల్ పాల్గొన్నారు.
మహానంది: మసీదుపురంలో టీడీపీ నాయకుడు మౌళీశ్వరరెడ్డి చేతుల మీదుగా సచివాలయం ఉద్యోగులు పింఛన్‌ను పంపిణీ చేయించారు. చెయ్యించారు. గోపవరంలో టీడీపీ యువత కార్యదర్శి క్రాంతికుమార్, నందిపల్లిలో మహేశ్వరరెడ్డి, ఈశ్వరరెడ్డి, మహేష్ ఆధ్వర్యంలో పింఛన్ అందజేశారు. మహానందిలో టీడీపీ నాయకులు శ్రీనివాసులు చేతుల మీదుగా అందించారు. బుక్కాపురంలో వినూత్నంగా తప్పెట్ల మోతతో ఇంటింటా తిరిగి అధికారులు, టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. గాజులపల్లి, గాజులపల్లి ఆర్‌ఎస్‌లో ఎంపీపీ యశస్వినీరెడ్డి, నియోజికవర్గ సమన్వయకర్త రామలింగారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, నాయకులు పింఛన్ పంపిణీ చేశారు.
శ్రీశైలం: శ్రీశైలం మండలంలో సచివాలయం సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు, బూత్ కన్వీనర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్‌ను పంపిణీ చేశారు. లబిద్ధదారులు హర్షం వ్యక్తం చేశారు.
వెలుగోడు: ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్కహామిని నెరవేరుస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖరరెడ్డి సతీమణి బుడ్డా శైలజ అన్నారు. వెలుగోడు పట్టణంలోని ఎస్సీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెలుగోడు పట్టణంలో షేక్ అహ్మద్ వీధి, దాసరి పేటలో సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఫించన్‌దారులకు మిఠాయిలు పంచి పెట్టారు. దాసరి పేటలో ఏకంగా టీడీపీ నాయకుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో పింఛన్‌దారులకు మటన్‌తో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు శేషిరెడ్డి, కలాం, కృష్ణుడు, రజాక్ ఖలీల్, జాకీర్ హుసేన్ చంద్ర, హిదాయత్ రసూల్, శంకర్‌రెడ్డి, భద్రుడు, బీజేపీ నాయకులు ప్రతాప్ ఆచారి, నాగేశ్వరరావు, జనసేన ఫాలు బాషా, సుకన్య పాల్గొన్నారు.
దేశచరిత్రలోనే ప్రథమం: ఎమ్మెల్యే బుడ్డా
ఆత్మకూరు: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కింద చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ దేశచరిత్రలోనే చారిత్రాత్మకమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు సోమవారం ఆత్మకూరులోని కొత్తపేట, ఏకలవ్యనగర్ కాలనీల్లోని లబ్ధిదారులకు సామాజిక పింఛన్ల సొమ్మును నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. అలాగే నల్లమలలోని నాగలూటి చెంచుగూడేన్ని సందర్శించి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన రెండు నెలల్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తే తాము సచివాలయ ఉద్యోగులతోనే ఈప్రక్రియను పకడ్బందీగా చేపట్టినట్లు వివరించారు. అలాగే సామాజిక పింఛన్లపై వైసీపీ నేతలు అనేక దుష్ప్రచారం చేశారని, కానీ తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వైసీపీ నాయకుల ఇళ్ల వద్దకే వెళ్లి పెరిగిన పింఛన్లను పంపిణీ చేశామని అన్నారు. పేదల కళ్లలో ఆనందమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్, ఎంపీడీవో శివప్రసాద్‌వర్మ, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్, నాయకులు కలిముల్లా, అబ్దుల్లాపురం బాషా, షాబుద్దిన్, సుబ్బరాజు, జనసేన నాయకులు శ్రీరాములు ఉన్నారు.
పేదలకు అండగా టీడీపీ: ఎమ్మెల్యే గౌరు చరిత
పాణ్యం: టీడీపీ పేదల ప్రభుత్వమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. పింఛన్‌ల పంపిణీలో భాగంగా ఆమె సోమవారం పాణ్యం, కౌలూరు గ్రామాలలో పింఛన్ పంపిణీ చేశారు. ఆమె మట్లాడుతూ ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు నిలబెట్టుకున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భాస్కరరెడ్డి, సర్పంచ్ బాలయ్య, డీపీవో మంజులావాణి, ఎంపీడీవో భాగ్యలక్ష్మి, ఏపీఎం ప్రసాద్, ఏపీవో విజయరాణి, టీడీపీ నాయకులు జయరాంరెడ్డి, రమణమూర్తి, సుభాన్, ఖాదర్‌బాషా, ప్రభాకర్, కార్యకర్తలు పాల్గొన్నారు. కొనిదేడులో టీడీపీ నాయకులు రాంపుల్లారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పింఛన్‌దారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈవోఆర్డీ సులోచన ఆధ్వర్యంలో పింఛన్ పంపిణీ చేశారు. కందికాయపల్లిలో ర్యాలీ నిర్వహించారు.
గడివేముల: గని, గడివేముల గ్రామాల్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులు, నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, మాజీ కో-ఆప్షన్ మెంబర్ రఫిక్, టీడీపీ సీనియర్ నాయకులు కృష్ణా యాదవ్, పంటా రామచంద్రారెడ్డి, మురళీ మోహన్‌రెడ్డి, గని హర్ష, మల్లికార్జున, దిలీప్ కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, ఖాలిద్ బాషా తదితరులు పాల్గొన్నారు.