Share News

ఓపీ కౌంటర్‌ వద్ద తగ్గిన రద్దీ

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:09 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఔట్‌ పేషెంట్‌ విభాగానికి ప్రతి రోజు 3వేల మంది రోగులు వస్తుంటారు.

ఓపీ కౌంటర్‌ వద్ద తగ్గిన రద్దీ

త్వరలో రెండు ఓపీ కౌంటర్లు

సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌రెడ్డి

కర్నూలు(హాస్పిటల్‌), జూన్‌ 11: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఔట్‌ పేషెంట్‌ విభాగానికి ప్రతి రోజు 3వేల మంది రోగులు వస్తుంటారు. ప్రతి సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఈ సంఖ్య మరి ఎక్కువగా ఉంటుంది. ఉదయం 9 గంటలకే ఓపీ కౌంటర్ల దగ్గర రోగులు క్యూలో నిలవడగా.. గంట, రెండు గంటల తర్వాత ఓపీ చీటి ఇస్తారు. ఈ ఇబ్బందులను తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సి. ప్రభాకర్‌ రెడ్డి నివారణ చర్యలు చేపట్టారు. ముందుగా ఓపీని ఉదయం 8.30 గంటలకే చీటిలను ఇచ్చేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మరో అదనపు కౌంటరును ఏర్పాటు చేశారు. ఈ-డిజిటల్‌ కౌంటర్‌ ఓపీకి స్పందన బాగా వచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సి.ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం మరో ఈ-డిజిటల్‌ కౌంటర్‌ను ప్రారం భించామని, త్వరలో స్త్రీలకు ప్రత్యేక రెండు అదనపు కౌంటర్లను ప్రారంభి స్తామన్నారు. దీంతో ఉదయం 10.30 గంటలకే ఓపీ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గిందన్నారు. ఈ-డిజిటల్‌ ఓపీ రెండో కౌంటర్‌ పెట్టడం ద్వారా 2,200 మంది ఔట్‌ పేషెంట్లు వచ్చారన్నారు. ఆసుపత్రిలో ఎవరైనా స్వచ్ఛందంగా ఎన్‌ఎస్‌ఎస్‌ తరుపున ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీ విద్యా ర్థులు రోగుల సహాయంగా రావాలని సూచించారు.

Updated Date - Jun 12 , 2024 | 12:09 AM