Share News

సమస్యాత్మక కేంద్రాల్లో తగ్గిన పోలింగ్‌

ABN , Publish Date - May 16 , 2024 | 12:45 AM

కర్నూలు అసెం బ్లీ పరిధిలో సమస్యాత్మక కేంద్రాలు-16, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు-7 ఉన్నట్లు గుర్తించారు.

సమస్యాత్మక కేంద్రాల్లో తగ్గిన పోలింగ్‌

66.6 శాతం నమోదు

అత్యంత సమస్యాత్మ కేంద్రాల్లో 64.5 శాతం

కర్నూలు(న్యూసిటీ), మే 15: కర్నూలు అసెం బ్లీ పరిధిలో సమస్యాత్మక కేంద్రాలు-16, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు-7 ఉన్నట్లు గుర్తించారు. ఈ కేంద్రాలలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాలైన రోజా-1, ప్రకాష్‌నగర్‌-5, సి. క్యాంపు-2, ఉస్మానియా కళాశాల-5, జొహరా పురం-3 కేంద్రాలలో మొత్తం 19,388 ఓటర్లు ఉం డగా 12,918 మంది ఓటు హక్కు వినియోగించు కున్నారు. 66.6 శాతం పోలైంది. అదే విధంగా అత్యంత సమస్యాత్మక కేంద్రాలైన కేశవ మెమో రియల్‌ పాఠశాల బుధవారపేట-4, కొత్తపేట రైతు బజార్‌-3 కేంద్రాలలో మొత్తం 7003 మంది ఓటర్లు ఉండగా 1259 మంది ఓటు హక్కు వినియోగించు కోవడంతో 64.5 శాతం పోలైంది. ప్రధానంగా ముస్లింలు ఉండే ప్రాంతాలలో తక్కువగా పోలింగ్‌ జరిగింది. వైసీపీ నాయకులు ముస్లిం ఓటర్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. కానీ వారు టీడీపీ వైపే ఎక్కువ శాతం మొగ్గుచూపినట్లు తెలుస్తోం ది. కర్నూలు అసెంబ్లీ పరిధిలో మొత్తం 258 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ రోజు 63.7 శాతం పోలైంది.

మొత్తం ఓటర్ల్లు 274465, పురుషులు- 132769, మహిళలు-141665, ఇతరులు-31

మొత్తం పోలైన ఓట్లు 174973, పురుషులు- 86250, మహిళలు-88715, ఇతరులు-08

సమస్యాత్మక కేంద్రంలో 19388 ఓటర్లు ఉం డగా 12918 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నారు.

అత్యంత సమస్యాత్మక కేంద్రంలో 7003 ఓటర్లు ఉండగా 1259 ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సమస్యాత్మకం కేంద్రాలు 16, అత్యంత సమ స్యాత్మం కేంద్రాలు 7 ఉన్నాయి.

Updated Date - May 16 , 2024 | 12:45 AM