Share News

తగ్గిన వేరుశనగ ధర

ABN , Publish Date - Oct 17 , 2024 | 12:31 AM

వ్యవసాయ మార్కె ట్‌కు పంట ఉత్పత్తులు రాక తగ్గుతున్న సమయంలో వేరుశనగ ధరలు తగ్గుముఖం పట్టాయి.

తగ్గిన వేరుశనగ ధర
మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన వేరుశనగ

ఆందోళనలో రైతులు

ఎమ్మిగనూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కె ట్‌కు పంట ఉత్పత్తులు రాక తగ్గుతున్న సమయంలో వేరుశనగ ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వేరుశనగ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌కు రోజు వేల క్వింటాళ్ల వేరుశనగ బస్తాలను రైతులు అమ్మకానికి తీసుకొస్తున్నారు. ఈ నెల ఆరంభం నుంచి మొన్నటి వరకు ధర రూ. 6 వేల నుంచి రూ. 7 వేల వరకు పలుకుతూ వచ్చింది. అయితే బుధవారం గరిష్ఠ ధర కాస్త రూ.5,970కు పడిపోయింది. ఈనెల 3వ తేదీ క్వింటం వేరుశనగ గరిష్ఠ ధర రూ.7,369 పలుకగా 4వ తేది రూ.7,080, 6వ తేదీ రూ.7029 పలికింది. అటు తరువాత ధరలు ఒక్కసారిగా 8వ తేదీకి రూ.6,600, 9వ తేదీ రూ. 6,570లకు దిగింది. ఇక పండుగ తరువాత 16వ తేదీ ఏకంగా వేరుశనగ ధర రూ. 5970లకు పడిపోయింది. పక్షం రోజుల్లోనే ఏడువేల నుంచి రూ.5900కు పడిపోవటంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. బుధవారం ఎమ్మిగనూరు చుట్టు ముట్టు ప్రాంతాల నుంచి మార్కెట్‌కు వేరుశనగ 1065 బస్తాలు అమ్మకానికి రాగా క్వింటం కనిష్ఠ ధర రూ.2009 గరిష్ఠ ధర రూ. 5970 పలికాయి. అలాగే ఆముదాలు 133 బస్తాలు రాగా క్వింటం కనిష్ఠ ధర రూ. 4809 గరిష్ఠ ధర రూ.5,831 పలికాయి.

Updated Date - Oct 17 , 2024 | 12:31 AM