లోకేశ్ శంఖారావంతో రాష్ట్ర ప్రజలకు భరోసా
ABN , Publish Date - Feb 11 , 2024 | 12:37 AM
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచాకాలకు వ్యతిరేకంగా ఈ నెల 11 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించనున్న శంఖారావం ప్రజలకు భరోసా ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాణ్యం ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు
మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచాకాలకు వ్యతిరేకంగా ఈ నెల 11 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించనున్న శంఖారావం ప్రజలకు భరోసా ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాణ్యం ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు శనివారం ఆమె మాట్లాడుతూ లోకేశ్ యువగళం పాదయాత్రలో పర్యటించని నియోజ కవర్గాల్లో శం ఖారావం చేపట్టనున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలకు వివరించేందుకు దాదాపు 40 రోజుల పాటు 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం నిర్వహిస్తారన్నారు. టీడీపీ మినీ మ్యానిఫేస్టోలోని ఆరు పథకా లను ప్రజలకు చేరవేర్చేలా ప్రణాళికలు రచించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాధితులుగా మారిన అన్నివర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తూ కార్యకర్తల్లో ధైర్యం నింపేలా కార్యాచరణ రూపొందించారని వివ రించారు. నారా లోకేష్ శంఖారావం విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.