Share News

వైభవంగా రథోత్సవం

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:27 AM

శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, రథోత్సవాన్ని దేవస్థానం వైభవంగా నిర్వహించింది.

వైభవంగా రథోత్సవం
రథోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు, అధికారులు

శ్రీశైలం, ఫిబ్రవరి 12: శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, రథోత్సవాన్ని దేవస్థానం వైభవంగా నిర్వహించింది. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి వేదికపై ఆశీనులను చేసి, అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో పూజలు చేశారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. తరు వాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి రథంపై అశీనులనుజేసి ప్రత్యేక పూజలు, మంగళహరతులు జరిపి ఆలయ ప్రాంగణంలో రథోత్స వాన్ని నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

అలరించిన నిత్యకళారాధన

శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా సోమవారం వందన డ్యాన్స్‌ అకాడమి, తాడిపత్రి బృందంచే సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గణపతి స్తోత్రం, శివతాండవం, హరహరశంభో, శివోహం తదితర గీతాలకు కళాకారులు నృత్య ప్రదర్శనతో అలరించారు.

Updated Date - Feb 13 , 2024 | 12:27 AM