రాక్షస పాలనకు అంతం తప్పదు: జయసూర్య
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:43 PM
రాక్షస పాలనకు అంతం తప్పదని నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య అన్నారు.

నందికొట్కూరు, ఏప్రిల్ 3: రాక్షస పాలనకు అంతం తప్పదని నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య అన్నారు. బుధవారం సూపర్ 6, డోర్ టూ డోర్ శంఖారావం కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని 20వ వార్డు వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య, నందికొట్కూరు పట్టణంలోని 20వ వార్డులో తాలుకా ఆఫీస్ రోడ్డు, రామాలయ వీధిలో చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను పట్టణ ప్రజలకు జయసూర్య వివరించారు. మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, మహేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.