Share News

రోడ్డు నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:14 AM

సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్‌ పి.రంజిత బాషా అధికారులను ఆదేశిం చారు.

రోడ్డు నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి
సీసీ రోడ్డు నాణ్యతను పరిశీలిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ పి.రంజిత బాషా

గూడూరు డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్‌ పి.రంజిత బాషా అధికారులను ఆదేశిం చారు. గురువారం గూడూరు మండలంలోని కె నాగలాపురం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధుల కింద కె.నాగ లాపురం గ్రామంలో సచివాలయం ముందు రూ.2 లక్షలతో నిర్మించిన ఇంటర్నల్‌ సీసీ రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంలో నాణ్యతను క్వాలి టీ కంట్రోల్‌ అధికారులు కచ్చితంగా చెక్‌ చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇంటర్నల్‌ సీసీ రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పం చాయతీరాజ్‌ ఎస్‌ఈ రామ చంద్రరెడ్డిని ఆదేశించారు. ఆయన వెంట డ్వామా పీడీ వెంకటరమణయ్య, పంచాయతీరాజ్‌ ఈఈ మద్దన్న, డీపీవో భాస్కర్‌, గూడూరు తహసీల్దార్‌ రామాంజనేయులు, ఎంపీడీవో శివ నాగప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:14 AM