నాణ్యమైన భోజనం అందాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:22 AM
విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. బుధవారం మండలంలోని జొన్నగిరి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు.
ఫపదో తరగతిలో ప్రతి విద్యార్థికి
60శాతం మార్కులు రావాలి: కలెక్టర్
ఫజొన్నగిరి ఎస్సీ హాస్టల్ తనిఖీ
తుగ్గలి, సెప్టెంబరు 4: విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. బుధవారం మండలంలోని జొన్నగిరి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వంట, సరుకులను పరిశీలించి, రుచి చూశారు. విద్యార్థులతో హాస్టల్లో కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సీబీఎస్‌ఈ సిలబస్ అర్థం అవుతుందా అని అడిగారు. పదో తరగతిలో ప్రతి విద్యార్థి 60 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. హాస్టల్‌లో గదులు పెచ్చులూడి శిథిలావస్థలో ఉన్నాయని, మరమ్మతులు చేయించాలని అన్నారు. జిల్లాలోని 37 సంక్షేమ హాస్టళ్ల స్థితిపై నివేదిక ఇవ్వాలని సంక్షేమ హాస్టల్ జేడీ రంగలక్ష్మిని ఆదేశించారు. ఎంపీపీ ఎర్రనాగప్ప, ఎంఈవో రమావెంకటేశ్ గౌడు, సర్పంచ్ ఓబులేసు, వార్డెన్ రమేష్, విద్యాకమిటి చైర్మన్ రవి యాదవ్, బాలన్న, లక్ష్మణ స్వామి, రాంపురం మల్లయ్య, డీలర్ సుంకన్న తదితరులు ఉన్నారు.
రూ.20 లక్షలతో హాస్టల్ అభివృద్ధి
జియో మైసూరు కంపెనీ ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో హాస్టల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆ కంపెనీ పీఆర్‌వో రామ్మోహన్ సోమిరెడ్డి కలెక్టర్‌కు తెలిపారు. మంచాలు, బెడ్స్‌తో పాటు దుప్పట్లు అందజేశామని, గదుల నిర్మాణం, డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామ న్నారు. కలెక్టర్ వారిని అభినందించారు.