Share News

ప్రజల రుణం తీర్చుకుంటా: కోట్ల

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:51 AM

డోన్‌ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

ప్రజల రుణం తీర్చుకుంటా: కోట్ల

డోన్‌, జూన్‌ 6: డోన్‌ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని కోట్ల నివాసానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కోట్ల సూర్యప్ర కాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత మ్మలకు పూలబొకేలు అందజేసి శుభాకాం క్షలు తెలిపారు. కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గుర య్యార న్నారు. మళ్లీ చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న నమ్మకం తో ఎన్డీయే కూటమికి ప్రజలు భారీ విజయం అందించారన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరు స్తామన్నారు. టీడీపీ కూటమి విజయం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో డోన్‌ మాజీ సర్పంచ్‌ టీఈ కేశవయ్యగౌడు, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ లక్ష్మిరెడ్డి, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, మర్రి రమణ, ఓంప్రకాష్‌, భాస్కర్‌ నాయుడు, రంజిత్‌ కిరణ్‌, బీజేపీ నాయకులు వడ్డె మహారాజ్‌, జనసేన నాయ కులు ఆలా మోహన్‌ రెడ్డి, పరదేశి మహేష్‌ పాల్గొన్నారు.

చెరువులకు నీరు నింపుతాం: కోట్ల

డోన్‌ నియోజకవర్గంలో చెరువులకు నీరు నింపేందుకు కృషి చేస్తామని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్యే కోట్ల తుంగభద్ర బోర్డు అధికారులతో సమావేశమయ్యారు. సాగు, తాగునీటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని, జూలై చివరికంతా శ్రీశైలం జలాశయానికి నీరు చేరవచ్చన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు కాల్వకు నీరు విడుదల చేసి డోన్‌, పత్తికొండ నియోజ కవర్గాల్లో చెరువులకు నీళ్లు నింపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తుంగభద్ర బోర్డు అధికారులను ఆదేశించారు. గుండ్రేవుల ప్రాజెక్టు డీపీఆర్‌ను ప్రస్తుత ధరలకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యేలా తాను కృషి చేస్తానని అన్నారు. తుంగభద్ర రిజర్వాయరు నుంచి ఎల్లెల్సీ కాల్వకు సంబంధించిన పైపులైన్‌ డీపీఆర్‌ను వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరారు. గాజులదిన్నె నుంచి డోన్‌, ప్యాపిలి, బేతంచెర్ల తాగునీటి సర ఫరా చేసేందుకు త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌ రెడ్డి, ఈఈ శైలేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:51 AM