Share News

డోన్‌లో ప్రభంజనం

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:07 AM

డోన్‌ పట్టణంలో నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ భారీగా విజయవంతమైంది.

డోన్‌లో ప్రభంజనం
సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు, పక్కన కోట్ల, బైరెడ్డి శబరి

చంద్రబాబు ప్రజాగళం సభ సక్సెస్‌

డోన్‌, ఏప్రిల్‌ 29: డోన్‌ పట్టణంలో నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ భారీగా విజయవంతమైంది. జనం ప్రభంజనంలా కదిలి వచ్చారు. ఉప్పొంగిన ఉత్సాహంతో పసుపు దండు కదం తొక్కింది. టీడీపీ కూటమి డోన్‌ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పోటీ చేస్తు న్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు కోట్లను గెలిపించాలని కోరుతూ డోన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు సభను విజయవంతం చేసేందుకు కోట్లతో పాటు మాజీ కోట్ల సుజాతమ్మ, కోట్ల రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. డోన్‌తో పాటు ప్యాపిలి, బేతంచెర్ల మండలాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. దీంతో డోన్‌ పట్టణంలోని రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. వేల మంది జనం ప్రభంజనంలా కదిలి వచ్చి సత్తా చాటారు. జనమే జనం.. డోన్‌ సభ అదిరిందని చంద్రబాబు చెప్పడంతో సభలో హర్ష ధ్వానాలు హోరె త్తాయి. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి చంద్రబాబు కోసం వేచిఉన్నారు. పాత బస్టాండు ప్రాంతంలోని మిద్దెలు ఫ్లైఓర్‌ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. చంద్రబాబు సభ భారీ సక్సెస్‌ కావడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నింపింది.

అవినీతి మంత్రిని ఓడించండి: కోట్ల

డోన్‌ నియోజకవర్గంలో నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న పోరా టంలో మంత్రి బుగ్గనను ఓడించాలని టీడీపీ కూటమి డోన్‌ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి పిలు పునిచ్చారు. సోమవారం సాయంత్రం డోన్‌ పట్ట ణం లోని పాతబస్టాండు లో టీడీపీ అధినేత చం ద్రబాబు పాల్గొన్న బహి రంగ సభలో కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి మాట్లా డుతూ తాను రైతు బిడ్డ గా మీ ముందుకు వచ్చా నని, మంత్రి బుగ్గన జమిందారులా ప్రజలను బానిసలుగా చూస్తున్నా రని ధ్వజమెత్తారు. మంత్రి బుగ్గన చెప్పే అభివృద్ధంతా దోచుకోవడమేనని విమర్శించారు. సీఎం జగన్‌, మంత్రి బుగ్గన ఇద్దరు దొంగలేనని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బుగ్గన తన నామినేష న్‌లో ఆస్తుల వివరాలను ఏమీ చూపకుండా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారు లను బెదిరించి ఆమోదించుకోవడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో కోట్ల రాఘవేంద్రరెడ్డి, మాజీ జడ్పీటీసీ కేఈ జయన్న, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై. నాగేశ్వరరావు యాదవ్‌, కోట్రికే ఫణిరాజ్‌, వలసల రామక్రిష్ణ, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ లక్ష్మీరెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ టీఈ కేశన్నగౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, మర్రి రమణ, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, చిట్యాల మద్దయ్యగౌడు, భాస్కర్‌ నాయుడు, రేగటి అర్జున్‌ రెడ్డి, రేగటి రామ్మోహన్‌ రెడ్డి, ధర్మవరం చిన్న నాగిరెడ్డి, గౌతమ్‌ రెడ్డి, సుధీష్‌, రంజిత్‌ కిరణ్‌, ఎస్‌ఎండీ రఫీ, బీజేపీ నాయకులు వడ్డె మహారాజ్‌, జనసేన నాయ కులు ఆలా మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

కోట్లను గెలిపించండి

ధర్మవరం సుబ్బారెడ్డికి న్యాయం చేసే బాధ్యత నాదే

చెరువులకు నీరు నింపి రైతులను ఆదుకుంటా

టీడీపీ అధినేత చంద్రబాబు హామీ

డోన్‌, ఏప్రిల్‌ 29: డోన్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డిని గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. సోమవారం సాయంత్రం డోన్‌ పాతబస్టాండులో ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. డోన్‌ టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో ధర్మవరం సుబ్బారెడ్డి ఎంతో కష్టపడి పని చేశారన్నారు. కొన్ని రాజకీయ సమీకరణలతో డోన్‌లో పెద్ద కుటుంబమైన కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డిని పోటీలో నిలబెట్టామని అన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన సుబ్బారెడ్డిని మరిచిపోలేనన్నారు. తనను నమ్ముకుని ఉన్న సుబ్బారెడ్డికి అన్ని రకాలుగా న్యాయం చేసే బాధ్యత తనదే అన్నారు. సుబ్బారెడ్డి అభిమానులంతా కోట్ల గెలుపులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సుబ్బారెడ్డి ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కోట్లను ఎమ్మెల్యేగా గెలిపించడం ద్వారా పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే తన వాగ్దానమని ప్రకటించారు. ప్యాపిలి మండలంలోని జలదుర్గాన్ని మండల కేంద్రంగా మారుస్తామ న్నారు. డోన్‌ నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీనీవా నీరు నింపి ఆదుకుంటామన్నారు. డోన్‌ నియోజకవర్గంలో హార్టికల్చర్‌ పంటల సాగుకు చేయూతనిస్తామని, అరటితోటల హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. రైతుల కోసం కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకుంటామన్నారు. డోన్‌ నియోజకవర్గంలో మైనింగ్‌ వ్యాపారులను ఆదుకునేందుకు రాయల్టీలు తగ్గిస్తామన్నారు. పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీలో స్థానికులైన 600 మంది కార్మికులకు తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామ న్నారు. ఉన్నత విద్యావంతురాలు బైౖరెడ్డి శబరిని నంద్యాల ఎంపీగా గెలిపించాలని కోరారు.

Updated Date - Apr 30 , 2024 | 01:07 AM