ఉద్యోగులకు పదోన్నతులు
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:38 PM
శ్రీశైలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు పదోన్నతులు పొందారు. దేవస్థానం పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న కె.సాయికుమారి, కె.వెంకటేశ్వరరావుకు ఏఈఓలుగా పదోన్నతి పొందారు.

శ్రీశైలం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు పదోన్నతులు పొందారు. దేవస్థానం పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న కె.సాయికుమారి, కె.వెంకటేశ్వరరావుకు ఏఈఓలుగా పదోన్నతి పొందారు. సీనియర్ అసిస్టెంట్లు రంగన్న, ఆర్.మల్లికా ర్జున, డి.నాగేశ్వరరావు, హరికృష్ణారెడ్డి, ఎం.శ్రీనివాసరావులు పర్యవేక్షకులుగా పదోన్నతి కల్పిస్తూ ఈవో ఎం.శ్రీనివాసరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మ, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పీవీ సుబ్బారెడ్డి ఉన్నారు.