Share News

మంత్రాలయంలో ప్రముఖులు

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:39 AM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్నూలు లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌, కర్నూలు జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ జడ్జి శ్రీనివాస్‌ మంగళవారం రాత్రి మంత్రాలయం వచ్చారు.

 మంత్రాలయంలో ప్రముఖులు

మంత్రాలయం, జనవరి 2: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్నూలు లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌, కర్నూలు జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ జడ్జి శ్రీనివాస్‌ మంగళవారం రాత్రి మంత్రాలయం వచ్చారు. వీరికి మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతి ఆచార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహ మూర్తి, ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు.

Updated Date - Jan 03 , 2024 | 12:39 AM