Share News

‘సమస్యలు పరిష్కరించాలి’

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:05 AM

మున్సిపల్‌ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్యలు డిమాండ్‌ చేశారు.

‘సమస్యలు పరిష్కరించాలి’
నంద్యాలలో ధర్నా చే స్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

నంద్యాల (నూనెపల్లె), జనవరి 31: మున్సిపల్‌ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్యలు డిమాండ్‌ చేశారు. బుధవారం ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నంద్యాలలోని బొమ్మలసత్రం సెంటర్‌లో ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని జడ్పీ, ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకు దాదాపు 1800 మందికి పదోన్నతులు కల్పించి మున్సిపల్‌ ఉపాధ్యాయుల విషయానికొచ్చేసరికి సర్వీస్‌ రూల్స్‌ సాకుగా చూపి వివక్షకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. దశాబ్దాలుగా మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నా యన్నారు. నేటికీ పీఎఫ్‌ సౌకర్యం కల్పించలేదని, వారి బకాయిలన్నీ అనామత్‌ఖాతాలో చేరిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణీకరణతో పెరిగిన జనాభాకు సరిపడా పాఠశాలలు స్థాపించాలన్నారు. మున్సిపల్‌ పాఠశాలల పర్యవేక్షణకు ఎంఈవో, డిప్యూటీ ఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చే శారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్‌ భాస్కరరెడ్డి, వీరేశ్వరరెడ్డి, రాజ్‌కుమార్‌, హరినాథ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:05 AM