Share News

బ్యాలెట్‌ పేపర్లు త్వరగా ప్రింట్‌ చేయండి

ABN , Publish Date - May 03 , 2024 | 12:21 AM

బ్యాలెట్‌ పేపర్లను త్వరగా ప్రింట్‌ చేసి అన్ని జిల్లాలకు పంపించండని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి. సృజన ఆదేశించారు.

బ్యాలెట్‌ పేపర్లు త్వరగా ప్రింట్‌ చేయండి

కర్నూలు(కలెక్టరేట్‌), మే 2: బ్యాలెట్‌ పేపర్లను త్వరగా ప్రింట్‌ చేసి అన్ని జిల్లాలకు పంపించండని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి. సృజన ఆదేశించారు. గురువారం స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణా కార్యాలయంలో సాధారణ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్ల ప్రింటింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎం కమిషనింగ్‌ మొదలైనందున తొలుత అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ బ్యాలెట్‌ పేపర్లు డిస్పాచ్‌ చేస్తామని అన్నారు. 16 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండి రెండు బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన పార్లమెంటు నియోజకవర్గాల బ్యాలెట్‌ పేపర్లు మాత్రం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తయిన తర్వాత ప్రింట్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ ఆర్వో భార్గవ్‌తేజ, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌. మోహన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:21 AM