Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పోలింగ్‌ స్టేషన్లను తనిఖీ చేయాలి

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:22 AM

కర్నూలు నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ను తనిఖీ చేయాలని సెక్టోరల్‌ అధికారులను కర్నూలు అసెంబ్లీ ఎలకో్ట్రలర్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, కార్పొరేషన్‌ కమిషనర్‌ భార్గవతేజ ఆదేశించారు.

పోలింగ్‌ స్టేషన్లను తనిఖీ చేయాలి

సెక్టోరల్‌ అధికారులకు కమిషనర్‌ ఆదేశాలు

కర్నూలు(న్యూసిటీ), మార్చి 2: కర్నూలు నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ను తనిఖీ చేయాలని సెక్టోరల్‌ అధికారులను కర్నూలు అసెంబ్లీ ఎలకో్ట్రలర్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, కార్పొరేషన్‌ కమిషనర్‌ భార్గవతేజ ఆదేశించారు. శనివారం కార్యాలయంలోని పాతకౌన్సిల్‌ హాలులో సెక్టోరల్‌ అధి కారులు, పోలీసు అధికారులతో సాధారణ ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ సెక్టోరల్‌ అధికా రులు, పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ ను పరిశీలించి అక్కడ కనీస వసతులు ఉన్నాయా.. లేవా అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, కర్నూలు అర్బన్‌ తహసీల్దారు మోహన్‌కు మార్‌, వన్‌ టౌన్‌, టు టౌన్‌, త్రీ టౌన్‌, ఫోర్త్‌ టౌన్‌ సీఐలు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:22 AM