రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:30 PM
ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.

నంద్యాల క్రైం, జూలై 28: ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నంద్యాలను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే ఎస్పీ ఆదేశాల మేరకు పాత నేరస్థులు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, డోన్ తదితర అన్ని సబ్ డివిజన్లలో ఈ కార్యక్రమం కొనసాగింది. చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షింది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎక్కడ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించారు. పోలీస్ శాఖ ఆదేశాలు, సూచనలను పెడచెవిన పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే 17 మంది రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. ఎవరైనా సత్ప్రవర్తన మార్చుకోకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుమానితుల కదలికలను పోలీస్ శాఖ గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచుతోందని, జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.