Share News

దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:38 AM

పోలీసు కానిస్టేబుళ్ల నియామక దేహ దారుఢ్య పరీక్షలు సోమవారం మొదటి రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఏపీఎస్‌పీ రెండో బెటాలియన్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు ఎస్పీ జి. బిందుమాధవ్‌ హాజరై పరీక్షలను ప్రారంభించారు.

దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
100 మీటర్ల పరుగుపందెం

మొదటి రోజు 190 మంది ఎంపిక

అమావాస్య కావడంతో పలువురు గైర్హాజర్‌

కర్నూలు క్రైం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పోలీసు కానిస్టేబుళ్ల నియామక దేహ దారుఢ్య పరీక్షలు సోమవారం మొదటి రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఏపీఎస్‌పీ రెండో బెటాలియన్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు ఎస్పీ జి. బిందుమాధవ్‌ హాజరై పరీక్షలను ప్రారంభించారు. ఈ పరీక్షకు 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 280 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హాజరయ్యారు. వీరికి సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ తర్వాత ఎత్తు, ఛాతీ వంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరికి ఫిజకల్‌ ఎఫిషియన్సీ టెస్టులు, 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ పరీక్షలు నిర్వహించారు. 1600 మీటర్ల పరుగు పరీక్షలో 240 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. 208 మంది అర్హత సాదించారు. 100 మీటర్ల పరుగులో 208 అభ్యర్థులు పాల్గొనగా 134 మంది అర్హత సాధించారు. లాంగ్‌జంప్‌లో 208 మంది అభ్యర్థులు పాల్గొనగా 187 మంది అర్హత సాధించారు. కానిస్టేబుల్‌ మెయిన్స్‌ పరీక్షకు మొదటి రోజు 190 మంది అర్హత సాధించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 10,143 మంది అభ్యర్థులు ఉన్నారన్నారు. ప్రతి రోజు 600 మంది అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షల్లో పాల్గొంటారన్నారు. ఏదేనా సమస్యపై అప్పీలు చేసుకునే వారు రిక్వెజిషన్‌ రాసి ఇచ్చి జనవరి 28న అప్పీలుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్‌ సదరన్‌ రీజియన్‌ మహేష్‌ కుమార్‌, అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ జి. హుశేన్‌పీరా, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అమావాస్య కావడంతో.. ఈ పరీక్షలకు సుమారు 300 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలుస్తున్నది.

Updated Date - Dec 31 , 2024 | 12:38 AM