Share News

నిబంధనల మేరకు అనుమతి

ABN , Publish Date - Oct 27 , 2024 | 01:11 AM

బాణసంచా స్టాల్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతిస్తామని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు.

నిబంధనల మేరకు అనుమతి
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య భదర్వాజ్‌

బాణసంచా వ్యాపారులతో సబ్‌ కలెక్టర్‌

ఆదోని, అక్టోబరు 26, (ఆంధ్రజ్యోతి): బాణసంచా స్టాల్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతిస్తామని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు. శనివారం కార్యాలయంలో డివిజన్‌లోని బాణ సంచా వ్యాపారులతో సమావేశం నిర్వహిం చారు. ప్రతి స్టాల్‌ వద్ద 200 లీటర్ల సామర్థ్య మున్న డ్రమ్ముల్లో నీరు నిల్వ ఉంచాలని, ఇసుక నింపిన బకెట్లు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. దుకాణాలకు మధ్య మూడు మీటర్ల దూరం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దుకాణాలను రేకుల షెడ్‌తో నిర్మించాలని, చిన్న పిల్లలకు బాణసంచా విక్రయించకూడదన్నారు. ఐఎస్‌ఐ ముద్ర ఉన్న బాణాసంచా మాత్రమే అమ్మేలా చూసుకోవా లన్నారు. అగ్నిమాపక వాహనం, అంబులెన్స్‌ సిద్ధంగా ఉంచాలని అవాంఛనీయ సంఘట నలు చోటుచేసుకోకుండా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. తహసీల్దార్‌ శివరాముడు, డీటీలు వీరేంద్ర గౌడ్‌, నిజాముద్దీన్‌, సర్కిల్‌ ఇన్సెపెక్టర్లు సూర్య మోహన్‌ రావు, మంజునాథ్‌ పాల్గొన్నారు

Updated Date - Oct 27 , 2024 | 01:11 AM