Share News

జగన్‌ను జైలుకు పంపడానికి జనం సిద్ధం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:50 AM

సీఎం పదవిని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన వైఎస్‌ జగన్‌ను ఓడించి జైలుకు పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి, డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

జగన్‌ను జైలుకు పంపడానికి జనం సిద్ధం

డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

డోన్‌, మార్చి 28: సీఎం పదవిని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన వైఎస్‌ జగన్‌ను ఓడించి జైలుకు పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి, డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. గురువారం డోన్‌ పట్టణంలోని కొండపే టలోని పలు వార్డులలో కూతురు కోట్ల నివేదితతో కలిసి కోట్ల సూర్యప్ర కాష్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్ర కాష్‌ రెడ్డి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారని, అది చాలదన్నట్లు మళ్లీ మేమంతా సిద్ధం అని సిగ్గు లేకుండా వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ దోపిడీ పాలనకు ముగింపు పలికి ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయన్నారు. మంత్రి బుగ్గనను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వై. నాగేశ్వరరావు యాదవ్‌, కోట్రికే ఫణిరాజ్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ టీఈ కేశన్నగౌడు, మాజీ సర్పంచ్‌ టీఈ కేశవయ్యగౌడు, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, ఓబులా పురం శేషిరెడ్డి, సుధీష్‌, ఎస్‌ఎండీ రఫి, గురుస్వామి యాదవ్‌, కిరణ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కోట్ల: పట్టణంలోని మర్రి చక్రపాణి పెట్రోల్‌ బంకు పక్కన మైదానంలో ఏర్పాటు చేసిన టీడీపీ పట్టణ కార్యాలయాన్ని డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి గురువారం ప్రారంభించారు. ముందుగా కోట్ల నివేదితతో కలిసి టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామని పార్టీ నాయకులు తెలిపారు.

యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం: కోట్ల

డోన్‌ నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. గురు వారం పట్టణంలోని కొండపేటలో వైసీపీకి చెందిన ఎరుకల సుబ్బరా యుడు కుటుంబంతోపాటు 20 కుటుంబాలు కోట్ల సమక్షంలో, గురుస్వా మి యాదవ్‌ ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ రోడ్ల వెడల్పులో రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన వారికి స్థలాలు చూపించి ఇళ్లు కట్టించే బాధ్యత మంత్రి బుగ్గనకు లేదా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే స్థలాలు కోల్పోయిన వారం దరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్‌, వలసల రామకృష్ణ, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ టీఈ కేశన్నగౌడు, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ రాజా నారాయణమూర్తి, భాస్కర్‌ నాయుడు, శ్రీనివాసభట్‌, లక్ష్మీనారాయణ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:50 AM