Share News

రోగులకు త్వరగా ఓపీ ఇవ్వాలి : సూపరింటెండెంట్‌

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:33 AM

ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీ టికెట్‌ త్వరగా ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సి.ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు.

రోగులకు త్వరగా ఓపీ ఇవ్వాలి : సూపరింటెండెంట్‌
నర్సింగ్‌ సిబ్బందితో మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌

కర్నూలు(హాస్పిటల్‌), జూన్‌ 10: ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీ టికెట్‌ త్వరగా ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సి.ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఓపీ కౌంటరు, క్యాజువాల్టీ విభాగాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ-డిజిటల్‌ కౌంటరుకు మంచి స్పందన వచ్చిందని, మరో డిజిటల్‌ కౌంటరు కూడా ప్రారంభిస్తామ న్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీ ఇవ్వడం వల్ల వారికి త్వరగా చికిత్స అందుతుందన్నారు. అనం తరం క్యాజువాల్టీకి చేరుకుని అక్కడ వైద్యసేవలు అందేవిధంగా చూడాలని సీఎంవోకి ఆదేశాలు జారీ చేశారు. సెక్షన్‌ మిషన్లు తక్కువగా ఉండటం గమనించి క్యాజువాల్టీకి రెండు యంత్రాలను మంజూరు చేశారు. తనిఖీల్లో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ ఏఆర్‌ఎంవో డాక్టర్‌ వెంకటరమణ, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌ డాక్టర్‌ శివబాల, క్యాజువాల్టీ మెడికల్‌ ఆఫీసర్‌ శ్వేత, ఆసుపత్రి ఏడీ రమేష్‌ పాల్గొన్నారు.

మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ : గుంటూరులో ఈనెల 27న జరిగే ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 18వ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను సోమవా రం కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సి.ప్రభాకర్‌ రెడ్డి ఆవిష్క రించారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షుడు బాలు నాయక్‌ మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘం నుంచి 45 శాతం ఫిట్మెంట్‌ వేతనం అమలు చేయాలని, 11వ పీఆర్సీ ప్రకారం పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఇవ్వాలని కోరారు. వైద్య ఉద్యోగులందరికీ ప్రీమియం చెల్లించకుండా హెల్త్‌ కార్డులు ఇవ్వాలన్నారు. జీవో.నెం.27ను సవరించి 10వ వేతన కమిటీ సిఫారసు ప్రకారం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మూల వేతనం, కరువు భత్యం, ఇంటి అద్దె కలిపి వంద శాతం వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సెక్రటరీ ఖాజా మొధ్దీన్‌, ట్రెరరీ సురేష్‌, సభ్యులు హరిచంద్రనాయుడు, నరసింహులు, సుందర్‌రాజు, రంజిత్‌, రాజు, మల్లికార్జున, ఉరుకుందయ్య, రమేష్‌, నూర్‌ అహ్మద్‌, గిరి పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 12:33 AM