Share News

ఆసుపత్రిలో త్వరలో పేపర్‌లెస్‌ ప్రక్రియ

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:09 AM

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో త్వరలో పేపర్‌లెస్‌ ప్రక్రియ ద్వారా డిజిటలైజేషన్‌ యూహెచ్‌ఐడీ ద్వారా రోగులకు సంబంధించిన ఆన్‌లైన్‌ ప్రక్రియ జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వి.వెంకటరంగారెడ్డి అన్నారు.

ఆసుపత్రిలో త్వరలో పేపర్‌లెస్‌ ప్రక్రియ

కర్నూలు(హాస్పిటల్‌), మార్చి 26: కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో త్వరలో పేపర్‌లెస్‌ ప్రక్రియ ద్వారా డిజిటలైజేషన్‌ యూహెచ్‌ఐడీ ద్వారా రోగులకు సంబంధించిన ఆన్‌లైన్‌ ప్రక్రియ జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వి.వెంకటరంగారెడ్డి అన్నారు. మంగళవారం ధన్వం తరీ హాలులో ఆరోగ్యశ్రీ ఈ-హాస్పిటల్‌పై హెచ్‌వోడీలతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వి.వెంకటరంగారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు సంబంధించిన యూహెచ్‌ఐఈడీ 11 అంకెల నెంబరు కీషీట్‌ను పరీక్షలను రెగ్యులర్‌గా మెయింటెన్‌ చేయాలని ఆదేశించారు. గ్యాస్ర్టో ఎంట్రాలజీ, న్యూరాలజీ, డెర్మాటాలజీ విభాగాలకు ఆరోగ్యశ్రీ నెల టార్గెట్‌ను పెంచుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ సర్జరీ, ఫల్మనాలజీ, ఫ్యామిలీ ప్లానింగ్‌ ఐడీ విభాగాలు ఈ-హాస్పి టల్‌సలో వంద శాతం పురోగతి సాధించారని హెచ్‌వోడీలను ఆయన అభినందించారు. ఈసమావేశంలో కర్నూలు మెడికల్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ హరిచరణ్‌, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో హేమనళిని, ఆర్‌ఎంవో వెంకటరమణ, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌ శివబాల, వివిధ విభాగాల హెచ్‌వోడీలు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:09 AM