Share News

అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:17 AM

శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం గానీ భ్రమరాంబకు అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం.

అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
కొబ్బరికాయల సమర్పణ కార్యక్రమంలో సిబ్బంది, భక్తులు

శ్రీశైలం, ఏప్రిల్‌ 16: శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం గానీ భ్రమరాంబకు అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏప్రీల్‌ 26న కుంభోత్సవం నిర్వహించనున్నారు. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహరతి సమర్పించడం ప్రధాన ఘట్టం. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే వచ్చే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తారు. మంగళవారం అమ్మవారి ఆలయ ప్రదక్షిన మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజాధికాలు నిర్వహించి అనంతరం అమ్మవారికి సమర్పించారు.

Updated Date - Apr 17 , 2024 | 12:17 AM